విరామం లేదు… విశ్రాంతి లేదు… ఓ సినిమా తరవాత మరో సినిమా… నేచురల్ స్టార్ నాని చకచకా షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్నాడు. మెట్రో ట్రైన్ టైపులో రయ్యమంటూ దూసుకెళ్తున్నాడు. అన్నట్టు… ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నాని హైదరాబాద్ మెట్రో హల్చల్ చేశాడు. అదీ ‘ఛలో’ ఫేమ్ రష్మికతో. జాలీగా మెట్రోలో రైడ్‌కి వెళ్లడం, అది పూర్తి చేసుకుని వచ్చేయడం కూడా జరిగాయి. నాగార్జున, నాని హీరోలుగా ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ సినిమాల ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్ ఒక మల్టీస్టారర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ మెట్రోలో జరిగింది. నాని, రష్మిక, సంపూర్ణేష్ బాబు తదితరులపై సన్నివేశాలు చిత్రీకరించి ఫస్ట్ షెడ్యూల్‌కి ప్యాకప్ చెప్పారు. ఈ షెడ్యూల్లో నాగార్జున లేరని సమాచారం. సెకండ్ షెడ్యూల్ నుంచి ఆయన టీంతో జాయిన్ అవుతారట. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన ‘ఆఫీసర్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసే పనిలో నాగ్ వున్నారట.