రాజమౌళి, రామారావు (తారక్/ఎన్టీఆర్), రామ్ చరణ్… మూడు పేర్లూ ‘ఆర్’ అక్షరంతో మొదలు కావడం, వీళ్లు ముగ్గురూ చేయబోయే సినిమాను ‘ఆర్ఆర్ఆర్’ పేరుతో ప్రకటించడం ప్రేక్షకులను ఆకర్షించింది. అయితే… ఆ ‘ఆర్’ మాయలో రాజమౌళి పెడ్డాడేమో అనే అనుమానం ఆడియన్స్‌కి కలుగుతోంది. ఎందుకంటే… ప్రచారంలో వున్నట్టు సినిమాలో నటించబోయే మిగతా నటీనటుల పేర్లు ‘ఆర్’ అక్షరంతోనే మొదలవుతున్నాయి మరి. ఇందులో విలన్‌గా యాంగ్రీ యంగ్‌మాన్ రాజశేఖర్ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన పేరు ‘ఆర్’తో మొదలైంది. హీరోయిన్లు విషయానికి వస్తే… రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, రష్మికా మండన్న పేర్లు పరిశీలనలో వున్నాయని తెలుస్తోంది. కథకు, అందులో పాత్రలకు సూట్ అవుతారని వీళ్లను తీసుకుంటున్నారో? లేదా సూటవడంతో పాటు ‘ఆర్’ అక్షరం కూడా కలిసొస్తుందని తీసుకుంటున్నారో? అసలు విషయం ఏదైనా రాజమౌళి ‘ఆర్’ టాపిక్ ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమా కథ ఇంకా రెడీ కాలేదని రామ్ చరణ్ చెబుతున్నా… సినిమా నటీనటుల ఎంపిక విషయంలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇదీ రాజమౌళి పబ్లిసిటీలో ఓ భాగమేమో. ఆయన ఇటువంటి విషయాల్లో దిట్ట.