మరి కొద్ది గంటల్లో రంగస్థలం హంగామా మొదలైపోతుంది. అడ్వాన్స్ బుకింగ్ కౌంటర్లు.. ఇప్పటికే కళకళలాడుతున్నాయి. థియేటర్ల దగ్గర సందడి చేయడానికి మెగా ఫ్యాన్స్ రెడీ అయిపోయారు. అయితే టీ సర్కార్… మెగా ఫ్యాన్స్కి షాక్ ఇచ్చింది. బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇచ్చేది లేదని ఖరాఖండీగా చెప్పేసింది. దాంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఆంధ్రాలో 5 షోలకు సర్కార్ అనుమతించింది. అక్కడ బెనిఫిట్ షోలు అర్థరాత్రి నుంచే మొదలయ్యు అవకాశం ఉంది. తెలంగాణలో శుక్రవారం తెల్లవారుఝామునుంచి షోలు ఉంటాయేమో అని ఫ్యాన్స్ భావించారు. నిర్మాతలు కూడా బెనిఫిట్ షో ల అనుమతి కోసం శతవిధాలా ప్రయత్నించారు. చరణ్ – కేటీఆర్ల మధ్య మంచి స్నేహం ఉంది. అక్కడ్నుంచి కూడా నరుక్కొచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. కానీ… టీ సర్కార్ మాత్రం ప్రత్యేక షోలను అనుమతులు నిరాకరించింది. తెలుంగాణలో శుక్రవారం ఉదయం 8.45కే తొలి షో పడబోతోంది. అంతకు ముందే రంగస్థలం చూడాలంటే…. ఏపీకి వెళ్లాల్సిందే.