శర్వానంద్ హీరోగా హనూ రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘పడి పడి లేచె మనసు’. ‘ఫిదా’, ‘ఎంసిఎ’ సినిమాల బ్యూటీ సాయిపల్లవి ఇందులో హీరోయిన్. ఈ సినిమా కోసం ఆమె భారీ మొత్తాన్ని కోట్ చేసిందనీ, ఒకదశలో ఆమెను నిర్మాతలు వద్దనుకున్నారని, చివరకు ఆమె అడిగినంత ఇచ్చి తీసుకున్నారనే మాటలు వినిపించాయి. కానీ, నిర్మాతలు మాత్రం ఆమెతో రెండో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి ‘పడి పడి లేచె మనసు’ నిర్మిస్తున్నారు. తొలి సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’తో ప్రేక్షకుల్ని, విమర్శకుల్ని, అందర్నీ ఆకట్టుకున్న వేణు ఊడుగుల తదుపరి సినిమా ఈ సంస్థలోనే చేయనున్నాడు. ఆల్రెడీ కథ లాక్ చేశారట. అందులో సాయిపల్లవిని హీరోయిన్గా తీసుకోవాలని అనుకుంటున్నారు. యంగ్ స్టార్ హీరోతో ఈ సినిమా చేస్తారట. అతనెవరో త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతం హీరోయిన్, దర్శక నిర్మాతల మధ్య డిసిషన్స్ జరుగుతున్నాయి. సాయిపల్లవి ‘యస్’ అంటారో? ‘నో’ అంటారో? వెయిట్ అండ్ సీ!