రంగస్థలం ఇప్పటికే దాదాపు మూడు గంటలుంది. అయినా.. సరే `సూపర్ హిట్` టాక్ వచ్చేసింది కాబట్టి – నిడివి పెద్ద సమస్య అనిపించడం లేదు. ‘ఇంకా ఉన్నా చూసేద్దుం’ అనే రేంజులో ఊగిపోతున్నారు మెగా ఫ్యాన్స్. మరి విడుదలకు ముందే పక్కన పెట్టిన మిగిలిన సన్నివేశాలు కలిపే అవకాశం ఉందా? ఈ విషయంపై సుకుమార్ స్పందించారు. ”చూస్తానంటే.. కలపడానికి రెడీగానే ఉన్నాం. ఓ పది నిమిషాల ఎపిసోడ్ ఒకటి ఉంది. దాన్ని పక్కన పెట్టాం. ఇప్పుడు నిడివి విషయంలో అభిమానులు క్షమించేశారు కాబట్టి.. కలిపే అవకాశం ఉంది. నిర్మాతలతో మాట్లాడి దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటాం” అని చెప్పాడు సుకుమార్. కమెడియన్ ఫృద్వీపై తెరకెక్కించిన ట్రాక్ దాదాపు 5 నిమిషాల వరకూ ఉంటుందట. చరణ్ – సమంతల ట్రాక్ కూడా ఒకటి పక్కన పెట్టారు. బహుశా.. ఇప్పుడు ఆ రెండూ కలిపే అవకాశం ఉంది.