యువ తమిళ దర్శకులది ఓ దారి అయితే… తెలుగుమ్మాయ్ కృష్ణప్రియాను పెళ్లి చేసుకున్న అట్లీది మరోదారి. అక్కడి యువ దర్శకులు కొత్త కొత్త కథలతో సినిమాలు తీస్తుంటే… అట్లీ తెలుగు దర్శకుల తరహాలో కమర్షియల్ ఫార్మటులో సినిమాలు తీస్తున్నాడు. తొలి సినిమా ‘రాజా రాణి’లో ట్రీట్మెంట్ కొత్తగా వుంటుంది. ఇక, తెలుగులో ‘పోలీస్’గా విడుదలైన ‘తెరి’, ‘అదిరింది’గా వచ్చిన ‘మెర్సల్’ సినిమాలు రొటీన్ కమర్షియల్ సినిమాలే. అభిమానులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసే ఈ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చేయనున్నాడని సమాచారమ్. “నా తదుపరి సినిమా తెలుగు వుంటుంది. ప్రముఖ తెలుగు హీరో అందులో నటిస్తారు. ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి. అందుకని, అందరూ కొన్ని రోజులు వెయిట్ చేయండి” అని అట్లీ పేర్కొన్నారు. అతడు డిస్కషన్ చేస్తున్నది అల్లు అర్జున్‌తోనే అట! డిస్కషన్స్ ఏ తీరానికి చేరతాయో? మొన్నామధ్య తమిళ దర్శకుడు లింగుస్వామి చాలారోజులు బన్నీతో సినిమా గురించి డిస్కస్ చేశాడు. చెన్నైలో సినిమా ఓపెనింగ్ జరిగింది. తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీయాలనుకున్నారు. కానీ, ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు. అట్లీ అయినా బన్నీ దగ్గర సినిమాను ఒకే చేయించుకుంటాడో? లేదో?