రామ్‌చరణ్ మాటే ఎన్టీఆర్ మాట కాదు… రాజమౌళి సినిమా విషయంలో ఇద్దరూ ఒక్క మాట మీదే వున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఒక మల్టీస్టారర్ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి మీడియా ప్రశ్నలకు ఏం జవాబు ఇవ్వాలో ముందుగా నిర్ణయం తీసుకున్నట్టు వున్నారు. ‘రంగస్థలం’ ప్రచార కార్యక్రమాల్లో *రాజమౌళి ఇంకా కథ రెడీ చేయలేదు. ఆయనపై నమ్మకంతో సినిమా అంగీకరించాను” అని రామ్‌చరణ్ చెప్పారు. ఈ రోజు ఐపీల్ ప్రచార కార్యక్రమం కోసం మీడియా ముందుకు వచ్చిన ఎన్టీఆర్‌ని రాజమౌళి సినిమా గురించి ప్రశ్నించగా సేమ్ టైప్ ఆన్సర్ ఇచ్చాడు. అంతే కాదు… రామ్‌చరణ్ మాటే నా మాట అన్నారు. “రాజమౌళి దర్శకత్వంలో నేనూ, రామ్‌చరణ్ చేయనున్న సినిమా గురించి ఇటీవల చరణ్ స్పష్టత ఇచ్చాడు. నా మాట కూడా అదే. మాకు రాజమౌళి పూర్తిగా కథ చెప్పలేదు. మీరు రెడీ అవ్వండని చెప్పారు. ఇద్దరు హీరోలు కాబట్టి మామధ్య తప్పకుండా కాంపిటీషన్ ఉంటుంది. అయితే… మా ఇద్దరి మధ్యలో రాజమౌళి వున్నారు కాబట్టి నువ్వా–నేనా అన్నట్లు ముక్కోణపు పోటీ వుంటుంది. అదీ ఆరోగ్యవంతమైన పోటీ. సినిమా గురించి పూర్తి వివరాలు రాజమౌళి వెల్లడిస్తారు” అని ఎన్టీఆర్ తెలిపారు.