‘అర్జున్‌రెడ్డి’పై అనసూయకు అంత అసూయ ఎందుకో మరి? నేనింకా ఆ సినిమాను చూడలేదని మీడియాతో చెప్పారు. ‘అర్జున్‌రెడ్డి’ విడుదల సమయంలో అనసూయ చేసిన వ్యాఖలు, వాటికి అభిమానులు స్పందించిన తీరు తీవ్ర దుమారాన్ని రేపాయి. మరోసారి ఆ వివాదంపై అనసూయ మాట్లాడారు. అప్పట్లో నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అనసూయ అన్నారు. “ఆ సినిమాపై నాకు ఎలాంటి కోపం లేదు. అందులో హీరోని స్ఫూర్తిగా తీసుకుని ప్రేక్షకులు మాట్లాడకూడని మాటలు మాట్లాడడం నాకు కోపాన్ని తెప్పించింది. నా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు” అని అనసూయ చెప్పారు. ‘రంగస్థలం’లో ఆమె చేసిన రంగమ్మత్త పాత్రకు ప్రేక్షకుల నుంచి స్పందన వస్తుందని ఊహించడలేదన్నారు. సుకుమార్ కథ చెప్పినప్పుడు అనసూయకు రామ్ చరణ్ హీరో అనే విషయం తెలియదని అన్నారు. తెలిసిన తర్వాత చరణ్ తో అత్త అని పిలిపించుకోవడం ఇష్టం లేక కొన్ని రోజులు ఆలోచించారట. సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్ చూసి తట్టుకునేంత మానసిక పరిపక్వత నాకింకా రాలేదనీ,అందుకనే ట్విట్టర్, పేస్ బుక్ అకౌంట్స్ మైంటైన్ చేయడానికి ఒక టీమ్ ని అపాయింట్ చేసుకున్నానని అనసూయ తెలిపారు.