ఎన్నో రోజులుగా నందమూరి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న నందమూరి మల్టీస్టారర్ సినిమా త్వరలో రూపొందించబడుతుంది. యంగ్ టైగర్ ను ఎప్పటినుండో డైరెక్ట్ చేయాలని తహ తహలాడుతున్న రచయిత వక్కంతం వంశీకి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట ఎన్.టి.ఆర్. అంతేకాదు ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కూడా ఉంటాడని ఫిల్మ్ నగర్ టాక్. ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు నటించిన చాలా సినిమాలకు కథలందించిన వక్కంతం వంశీ ఇప్పుడు తన కథకు తానే దర్శకుడిగా మారి సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.
సురేందర్ రెడ్డి తో తేడాలొచ్చి సొంతం కుంపటి పెట్టుకున్న వక్కంతం వంశీ ఇప్పుడు సినిమా దర్శకత్వం చేయాలని మంచి ఊపుమీదున్నాడు. ఇటీవల నాన్నకు ప్రేమతో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న తారక్ ఫిబ్రవరి నుండి కొరటాల శివ దర్శకత్వంలో చేసే జనతా గ్యారేజ్ షూటింగ్లో పాల్గొననున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత తారక్ నటించే సినిమా దాదాపు ఇదే కావొచ్చని అంటున్నారు. అంటే ఆ లెక్క ప్రకారం ఈ ఏడాది రెండో సగంలో నందమూరి మల్టీ స్టారర్ ఉండబోతుందన్నమాట. అంతేకాదు సినిమా కళ్యాణ్ రామ్ స్థాపించిన ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నిర్మించబడుతుంది అని తెలుస్తుంది. మరి క్రేజీ కాంబోగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.