వెంకటేష్ – తేజ కాంబినేషన్లో ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుని రెగ్యులర్ షూటింగ్ కోసం ఎదురుచూస్తున్న సినిమా ఇది. ఇప్పుడు ఆగిపోయినట్టు టాక్. ఈ సినిమాని వెంకటేష్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా. తేజ చేతిలో ఎన్టీఆర్ బయోపిక్ ఉంది. ఓవైపు వెంకీతో సినిమా చేస్తూ.. మరోవైపు బయోపిక్ పనులు చేయడం తేజకు కష్టంగా మారింది. ముందు వెంకీ సినిమా పూర్తి చేద్దామని తేజ భావించాడు. కానీ.. బాలయ్య మాత్రం ఈసినిమా ‘దసరాకి రావాల్సిందే’ అని అల్టిమేట్టం జారీ చేశాడట. దాంతో.. వెంకటేష్ సినిమాని తప్పని పరిస్థితుల్లో పక్కన పెట్టినట్టు సమాచారం. ఇప్పుడు ఈ స్క్రిప్టుని వేరే దర్శకుడితో వెంకీ లాగించేస్తాడా, లేదంటే.. పూర్తిగా పక్కన పెట్టేస్తాడా? అనేది తేలాల్సివుంది. వెంకటేష్ చేతిలో రెండు సినిమాలున్నాయి. నాగచైతన్యతో మల్టీస్టారర్ చేస్తున్నాడు వెంకీ. మరోవైపు వరుణ్‌తేజ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. తేజ సినిమా పక్కన పెట్టాడు కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఈ రెండు సినిమాలపై ఫోకస్ పెట్టొచ్చు.