ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎవరి ఊహకి అందని అద్భుతాలు జరగబోతున్నాయి. చిత్రసీమలో బడా బడా స్టార్లు ఈ సినిమాలో అతిథి పాత్రల్లో మెరవబోతున్నారని తెలుస్తోంది. అందులో మహేష్‌బాబు కూడా ఉన్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్టీఆర్ హయాంలో ఏఎన్నార్ తో పాటు కృష్ణ కూడా తనకంటూ ఓ స్థానాన్ని సృష్టించుకున్నాడు. ఎన్టీఆర్ – కృష్ణ కలసి నటించిన మల్టీస్టారర్లుఎన్నో. వాళ్ల మధ్య స్నేహమే కాదు, చిన్నిపాటి అలకలూ, విబేధాలూ వచ్చాయి. ఎన్టీఆర్‌పై కోపంతో కృష్ణ ఓ సినిమా కూడా తీశారు. ఎన్టీఆర్ కథ చెబుతూ… ఆనాటి కృష్ణ ఎపిసోడ్లని గుర్తు చేయకుండా ఎలా ఉంటారు? అందుకే ఈ కథలో కృష్ణ పాత్రకూ తగిన ప్రాధాన్యం ఉంది. ఆ పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు మహేష్‌కి బాలయ్య ఫోన్ చేసినట్టు.. ‘ఎన్టీఆర్ సినిమాలో కనిపించాలి’ అని అడిగినట్టు తెలుస్తోంది. దానికి మహేష్ కూడా ‘సరే’ అన్నాడని టాక్. నిజంగానే ఈపాత్ర చేయడానికి మహేష్ ఒప్పుకుని, బాలయ్య – మహేష్ ఒకేసారి తెరపై కనిపిస్తే.. ఆ దృశ్యమే మనోహరంగా ఉంటుంది. ఒక్క మహేష్ బాబునే కాదు.. చాలామంది టాలీవుడ్ కథానాయకులు వివిధ పాత్రల్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. వాళ్లందరి పేర్లూ బయటకు వస్తే.. ఈ ప్రాజెక్ట్ స్వరూపమే మారిపోతుంది.