‘రంగస్థలం’లో సమంత లుక్ చాలామందిని ఆశ్చర్యపరిచింది. పల్లెటూరి అమ్మాయి మహాలక్ష్మిగా.. పరికిణీలో డీ గ్లామర్‌గా కనిపిస్తూనే.. అందాలు ఒలికించింది. సమంత మూతి విరుపులు, తిట్లూ, శాపనార్థాలూ భలే నచ్చేశాయి. ఇదివరకెప్పుడూ చూడని సమంతని ‘రంగస్థలం’లోని మహాలక్ష్మి చూపించింది. మరి ఈ లుక్ చూసి.. చైతూ ఏమన్నాడు? చైతూకీ నచ్చిందా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు సమంత నిజాయితీగానే సమాధానం చెప్పింది.
సమంత లుక్ చూడగానే… ‘ఇదేంటిది?’ అని ఆశ్చర్యంగా.. కాస్త చిరగ్గా ఫేస్ పెట్టాడట నాగచైతన్య. ”ఇదివరకెప్పుడూ నన్ను అలా చూడలేదు కదా? అందుకే ఇదేంటి? ఇలా ఉన్నావ్ అంటూ మొహం ఒకరకంగా పెట్టి అడిగాడు.” అంటూ నవ్వేస్తోంది సమంత. అయితే సినిమా చూశాక మాత్రం క్యారెక్టర్లో డెప్త్ అర్థమైందట. సినిమా చైతూకి బాగా నచ్చిందని, తన క్యారెక్టర్ని బాగా ఎంజాయ్ చేశాడని సమంత చెబుతోంది. అందరూ అనుకుంటున్నట్టు ఇది డీ గ్లామర్ పాత్ర కాదంటోంది సమంత. మహాలక్ష్మి అమాయకత్వంలో, నిజాయతీలో ఓ అందం ఉంది.. ఇది గ్లామర్ రోలే.. అని సమాధానం చెప్పింది.