సోగ్గాడే చిన్ని నాయనా అంటూ వచ్చి సంక్రాంతికి అసలు సిసలైన హిట్ కొట్టిన నాగార్జున మరోసారి తన నటన వైభవాన్ని ప్రదర్శించడం జరిగింది. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందన్న నమ్మకం ముందునుండీ చెప్పుకొచ్చి మంచి పోటీలో కూడా విడుదల చేసి సినిమాను హిట్ చేసుకున్నారు. ఇకపోతే ఇప్పుడు ఆ సినిమాలో తనకు అన్యాయం జరిగింది అంటూ వాపోతుంది యాంకర్ అనసూయ.
ప్రముఖ చానెల్ ఈటివిలో జబర్దస్త్ షోతో మంచి పాపులారిటీ సంపాధించిన అనసూయ తన హాట్ అందాలతో ఓ చిన్నపాటి హీరోయిన్ క్రేజ్ సంపాధించింది. అయితే అప్పట్లో పవర్ స్టార్ అత్తారింటికి దారేది సినిమా అవకాశం వచ్చినా కాదని హాట్ న్యూస్ గా నిలిచిన ఈ అమ్మడు సోగ్గాడే చిన్ని నాయనాలో నాగార్జున మరదలిగా నటించింది. అయితే సినిమాలో అమ్మడి పాత్ర నిడివి విషయంలో కాస్త రుసరుసలాడుతుందట ఈ భామ. సినిమా కథ చెప్పినపుడు తనకు 20 నిమిషాల దాకా క్యారక్టర్ ఉందని చెప్పారని.. తీరా సినిమా చూస్తే కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉందని బాధపడుతుంది.
అయితే సినిమా షూటింగ్ టైంలో అనసూయ మీద చాలా సన్నివేశాలు షూట్ చేసినా ఎడిటింగ్ లో అన్నీ లేపేశారట. లెంథ్ కోసమే ఇలా చేశారని తెలుస్తున్నా తన పాత్ర నిడివి పట్ల అనసూయ అంత సాటిస్ఫైడ్ గా లేదు అన్నది తెలుస్తుంది. అంతేకాదు సినిమా దర్శక నిర్మాతలు తనని మోసం చేశారని సన్నిహితుల దగ్గర మొరపెట్టుకుంటుందట. మరి ఈ విషయం మీద చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.