ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా? పోకిరి సినిమాలో డైలాగ్ ఇదే. ఈ సినిమాని చూసిందో లేదో కానీ.. ఓ బొద్దు గుమ్మ మాత్రం సేమ్ టు సేమ్ ఫాలో అయిపోతోంది. ఎప్పుడొచ్చామన్నది కాదు.. ఎన్ని ఆఫర్లు పట్టేశామన్నది పాయింట్ అంటోంది.
2016లో టాలీవుడ్ కి సక్సెస్ తో ఓపెనింగ్ చేసింది శైలజ. అదే నేను శైలజ హీరోయిన్ కీర్తి సురేశ్. సైజ్ జీరోతో ఉన్న హీరోయిన్లను చూసి.. చూసి..తెలుగువారికి మొహం మొత్తేసిన టైమ్ లో కొంచెం ముద్దుగా.. కొంచెం బొద్దుగా.. కొంచెం సంసారపక్షంగా.. ఇంకొంచెం ట్రెండీగా.. ఉన్న ఈ కీర్తి సురేశ్ ని చూడగానే.. తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ప్రేక్షకులే కాదు. సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కూడా బాగా కనెక్ట్ అయిపోయింది. అందుకే వరుస ఆఫర్లు ఇచ్చేస్తోంది.
నేను శైలజ రిలీజ్ అయిన వారం రోజులకే.. చెన్నై నుంచి ఆఫర్ వచ్చింది కీర్తికి. రజనీ కాంత్ అల్లుడు, తమిళ స్టార్ హీరో ధనుష్ పక్కన హీరోయిన్ గా లక్కీ చాన్స్ కొట్టేసింది. ఓ వైపు మూవీ సక్సెస్ ని, మరో వైపు కొత్త ఆఫర్ హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేసే లోపే.. మరో రెండు ఆఫర్లు కీర్తి కొంగు పట్టుకున్నట్టు టాక్. అది కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోలైన రామ్ చరణ్, మహేశ్ బాబు మూవీల్లో ఆఫర్ వచ్చినట్టు టాక్. తమిళ రీమేక్ లో నటిస్తున్న రామ్ చరణ్ పక్కన తీసుకోవాలని చూస్తున్నారట. ఇక మురుగదాస్ డైరెక్షన్ లో చేయబోయే మూవీకి.. కీర్తిని బుక్ చేద్దామని ప్రిన్స్ అనుకుంటున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు ఓకే అయితే.. మాత్రం.. ఒక్కసారిగా టాప్ హీరోయిన్ గా సెటిల్ అయిపోవడం ఖాయం.