భరత్ అనే నేను సినిమాపై ఓ వార్త గట్టిగానే చక్కర్లు కొట్టింది. ఈ కథ కొరటాల శివది కాదని, మరో రచయిత నుంచి కొరటాల ఈ కథని తీసుకున్నాడని, అందుకు ఏకంగా కోటి రూపాయల పారితోషికం కూడా అందించాడని చెప్పుకున్నారు. కొరటాల శివ స్వతహాగా రచయిత. తన దగ్గర దాదాపు పది కథలు బౌండెడ్ స్క్రిప్టుతో సహా సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయాన్ని తనే కొన్ని సందర్భాల్లో చెప్పాడు. అలాంటి శివకు మరొకరి కథ ఎందుకు తీసుకోవాల్సివచ్చిందా? అనిపించింది. అయితే కథ బాగా నచ్చిందని.. అందుకే శివ అన్ని డబ్బులిచ్చి మరీ తీసుకున్నాడని, టైటిల్స్‌లో సదరు రచయితకు క్రెడిట్ కూడా ఇవ్వనున్నాడని వార్తలొచ్చాయి. అయితే… కొరటాల మాత్రం `ఈ కథ నాదే.. ఎవరి దగ్గరా కొనలేదు` అని క్లారిటీ ఇచ్చేశాడు. `నా స్నేహితుడు `కథానాయకుడ్ని ముఖ్యమంత్రిగా చూపిస్తే బాగుంటుంది` అని సలహా ఇచ్చాడు. అందులోంచే భరత్ కథ పుట్టుకొచ్చింది. అంతేతప్ప ఈ కథని ఎవరి దగ్గరా తీసుకోలేదు.. కథ నాదే“ అన్నాడు. సో.. కోటి రూపాయల వార్త నిజం కాదన్నమాట.