అమితాబ్ బచ్చన్ రాకతో ‘సైరా’ టీమ్‌కి ఊపొచ్చింది. వరుసగా పది రోజుల పాటు షూటింగ్ చేసేశారు. నయనతార, చిరంజీవి కూడా ఈ షూటింగ్ లో పాలుపంచుకున్నారు. ఇప్పుడు ‘సైరా’కి మరో బ్రేక్ పడింది. తన వ్యక్తిగత పనులతో చిరు అమెరికా పయనం అవుతున్నాడు. ఆయన తిరిగొచ్చాకే ‘సైరా’ కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుందట. బిగ్ బీకి సంబంధించిన సన్నివేశాలన్నీ ఏకధాటిగా తెరకెక్కించి, అప్పుడు బ్రేక్ ఇవ్వాలన్నది `సైరా` టీమ్ ఆలోచన. కానీ.. చిరంజీవినే స్వయంగా ‘బ్రేక్’ కోరడంతో – షూటింగ్‌కి పేకప్ చెప్పేశారు. దాంతో బిగ్ బీ కూడా ముంబై వెళ్లిపోయారు. చిరు తిరిగొచ్చాక అప్పుడు కొత్త షెడ్యూల్ ప్లాన్ చేయస్తారట. రెండో కథానాయికగా తమన్నా ఎంపిక దాదాపుగా ఖాయమైపోయింది. ఈ పాత్రలో ముందు ఐశ్వర్యరాయ్‌ని తీసుకుందామనుకున్నారు. అయితే ఐష్ సున్నితంగా తిరస్కరించడంతో ఆ పాత్ర తమన్నాకి దక్కింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.