శ్రీవాస్ కి దర్శకుడిగా కొన్ని హిట్లున్నాయి. అయితే.. అతని బాటెప్పుడూ.. మాస్ కమర్షియల్ హంగులే. ఫక్తు ఫార్ములా కథల్ని సినిమాలుగా మలచి హిట్లు కొట్టాడు. సాక్ష్యం కోసం మాత్రం రూటు మార్చినట్టు అర్థమవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. పూజా హెగ్డే నాయిక. ఇప్పుడు టీజర్ విడుదలైంది. సినిమా స్టాండర్డ్స్, టెక్నికల్ వాల్యూస్ అన్నీ ఈ టీజర్లో కనిపించాయి. ప్రతీ ఫ్రేమూ రిచ్‌గా ఉంది. నాలుగు దిక్కులే కాదు, కనిపించని ఐదో దిక్కు ఉంది.. అదే కర్మ.. మన పనులన్నింటికీ అదే సాక్ష్యం అనే పాయింట్ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఫాంటసీ అంశాల్నీ జోడించినట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. నిర్మాత అభిషేక్ నామా ఏ విషయంలోనూ రాజీ పడకుండా భారీగా ఖర్చు పెట్టిన వైనం ఫ్రేముల్లో కనిపిస్తోంది. జగపతిబాబు, శరత్ కుమార్లాంటి భారీతారాగణం ఉంది. బెల్లంకొండ లుక్ కూడా ఫ్రెష్ గా ఉంది. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందించారు. సాక్ష్యం టైటిల్‌కి జస్టిఫికేషన్‌గా చెప్పించిన డైలాగ్ బాగుంది. మొత్తానికి టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచేశాడు శ్రీవాస్. సినిమా ఎలా ఉంటుందో చూడాలిక.