కాస్టింగ్ కౌచ్ పై మెగా హీరోలు వరుసగా పెదవి విప్పుతున్నారు. శ్రీరెడ్డి విషయంలో పవన్ కల్యాణ్ ముందుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత.. నాగబాబు మీడియా ముందుకొచ్చారు. చరణ్ కూడా ఈ విషయంపై నోరు మెదిపాడు. ఇప్పుడు అల్లు అరవింద్ వంతు వచ్చింది. టాక్సీవాలా టీజర్ ఆవిష్కరణకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జరుగుతున్న పరిణామాల గురించీ మాట్లాడారు. బాహుబలి లాంటి సినిమా తీసి, పరిశ్రమ విజయ గర్వంతో రెపరెపలాడుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో మన పరువు మనమే తీసుకునేలా ప్రవర్తించడం బాధాకరమన్నారు అరవింద్. పరిశ్రమలో తప్పులు జరగడం లేదని తాను అనడం లేదని, కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి మాట్లాడడం బాధ కలిగిస్తోందని, మీడియా వాళ్లు కూడా దీన్ని ప్రోత్సహించకూడదని హితవు పలికారు.