తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి విభానికి యూనియన్లుంటాయి. సమస్య వస్తే అందరూ కలసి పోరాడుతారు. కానీ టాలీవుడ్ కే అర్థం కాని సమస్య వచ్చినప్పుడు మాత్రం ఒక్కటి కాలేకపోతున్నారు. శ్రీరెడ్డి ఇష్యూలో… పలువురు ప్రముఖులు తమ ఎజెండాను తాము అమలు చేస్తూ ఇండస్ట్రీని మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నారు.
“మా” గా పిలుచుకునే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో… సభ్యత్వం అంత తేలిగ్గా ఎవరికీ రాదు. దానికి రెండు కారణాలున్నాయి. సభ్యత్వం పొందాలంటే.. కమిటీ ఆమోదం అవసరం. అంతకు మించి సభ్యత్వ ఫీజు దాదాపుగా రూ. 2 లక్షల రూపాయలు. చిన్న చిన్న ఆర్టిస్టులు.. అంత మొత్తం కట్టలేరు. కానీ ప్రతిష్టాత్మకం కాబట్టి.. గుర్తింపు కోసం కడదామని డబ్బులు సమకూర్చుకున్నా… కమిటీ … అంత త్వరగా అవకాశం ఇవ్వదు. బాగా గుర్తింపు పొందిన నటులకే మాత్రమే మాలోచాన్స్ ఉంటుంది. ఆర్థికంగా ఎదగలేకపోయినా సీనియర్ ఆర్టిస్టులకు ఉచితంగా సభ్యత్వం ఇస్తారు.
ఇంతే కాదు.. సభ్యత్వం తీసుకోమని బతిమాలే.. బెదిరించే క్లాజ్ కూడా.. “మా” లో ఉంది. ఇతర భాషల నుంచి వచ్చే హీరోయిన్లు కోట్లు గడిస్తూంటారు. కానీ వారు.. తమిళనాడు నడిగర్ సంఘంలో సభ్యత్వం తీసుకుంటారు కానీ “మా” లో తీసుకోరు. వీరిని సభ్యత్వం తీసుకోమని తీసుకోమని మా సభ్యులు తరచూ బతిమాలుతూంటారు. కొన్నిసార్లు సభ్యత్వం తీసుకోకపోతే.. షూటింగ్ ల నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తూ ఉంటారు కూడా. ఇదంతా సభ్యత్వ రుసుము కోసమే.
ఈ “మా” రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొత్తవేమీ కాదు. “మా” పుట్టినప్పటి నుంచి ఉన్నవే. ఇప్పుడు శ్రీరెడ్డి ఇష్యూతో ఇవి కూడా తెరపైకి వచ్చాయి. జరుగుతున్న వ్యవహారాలపై “మా”కి అందరూ సపోర్ట్ గా నిలిచారు. కానీ ఇంత వరకూ దీనిపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయని మంచు ఫ్యామిలీ.. తొలిసారి.. “మా” విదివిధానాల్లో లోపాలున్నాయంటూ… లేఖ రాసి సంచలనం సృష్టించింది. మంచు విష్ణు.. స్థానిక కళాకారులకు,… మాలో అవకాశం దక్కడం లేదంటూ… లేఖ రాసి.. వివాదానికి మరింత ఆజ్యం పోశారు.
మా అధ్యక్షుడు శివాజీరాజా శ్రీరెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రివర్స్ అయింది. ఈ సమయంలో… మా పై విమర్శలు పెరిగేలా.. అనుమానాలు రేకెత్తేలా.. మంచు విష్ణు లేఖ రాయడం టాలీవుడ్ లో ఉన్న లోసుగులను బయటపెట్టినట్లయింది. వివాదాలతో మేమంతా మరింత ఐక్యమత్యంగా మారామని హేమ చెప్పీచెప్పక ముందే… క్రాకులు బయటపడ్డాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తూంటే.. టాలీవుడ్ సీరియల్ ఇప్పుడల్లా ముగిసే అవకాశాలు కనిపించడం లేదు.