కాస్టింగ్ కౌచ్ అనే అంతర్గత విషయాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చింది శ్రీరెడ్ది. ఇప్పటికే టాలీవుడ్ లోని బడా బడా పేర్లు బయటపెట్టింది. కొన్ని ఆధారాలు చూపించింది. అయితే క్రమంగా ఈ ఇష్యూ పక్క దారి పట్టడం మొదలైంది. అందుకే మళ్లీ ఈ వ్యవహారాన్ని ట్రాక్ ఎక్కించాలని శ్రీరెడ్డి గట్టి ప్రయత్నాల్లో ఉందని తేలింది. అయితే ఈసారి టార్గెట్ సినిమా వాళ్లు కాదట. టీవీ ఛానల్ యాజమాన్యంపై శ్రీరెడ్డి బాణాలు సంధించడానికి సిద్ధమైందట. కొన్ని ప్రైవేటు ఛానళ్లలో సీరియళ్లు విరివిగా ప్రసారం అవుతున్నాయి. అవన్నీ అవుట్ సోర్సింగ్ ద్వారా జరిగే వ్యవహారాలే. అయితే సీరియళ్లలో అవకాశాలు ఇస్తామని చెప్పి, టీవీ ఛానల్ యాజమాన్యం, కొంతమంది పెద్ద తలకాయలు నటీమణుల్ని తమ సొంత అవసరాల కోసం వాడుకుంటున్నారని, వాటిని సాక్ష్యాధారాలతో బయటపెట్టడానికి శ్రీరెడ్డి సిద్ధం అవుతోందని తెలుస్తోంది. ఈటీవీ, జెమిని, మా టీవీ, జీ టీవీ ఇలా ప్రముఖమైన టీవీ ఛానళ్లపై శ్రీరెడ్డి పోరాటం చేయబోతోందని, ముందుగా సాక్ష్యాధారాలు బయటపెట్టే, సమరానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. దీంతో బుల్లితెరపై కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎలా సాగుతుందో బయటపెట్టాలన్నది శ్రీరెడ్డి ప్రయత్నం. వర్మ ఇష్యూతో ఈ వ్యవహారం మొత్తం పక్కదోవ పట్టేసింది. ఇప్పుడు దాన్ని మళ్లీ ట్రాక్ ఎక్కించాలంటే ఏదో ఓ బలమైన సాక్ష్యంతోనే శ్రీరెడ్డి ఎంట్రీ ఇవ్వాలి. మరి ఈసారి తొలి బాణం ఎవరిపై సంధిస్తుందో చూడాలి.