మెగా కాంపౌండ్ మొత్తం … ఫిల్మ్ చాంబర్ లో బలప్రదర్శన చేయడం టాలీవుడ్ లో కలకలం రేపింది. బహిరంగంగా చెప్పకపోయినా… మెగా ఫ్యామిలీ డిమాండ్.. ఉన్న పళంగా రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవడం.అంతర్గతంగా చాంబర్ లోనే దీనిపై చర్చలు జరిగాయి. మెగా బ్రదర్స్ తల్లిని తానే తిట్టించానని రామ్ గోపాల్ వర్మ.. స్వయంగా ఒప్పుకన్నందున చర్య తీసుకోవాల్సిదేనని పవన్ కల్యాణ్ పట్టుబట్టారు. చాంబర్ కు వచ్చిన మా అసోసియేషన్ ముఖ్యలతో చర్చించారు. సినీ వ్యవహారాలను పర్యవేక్షించే ఇండస్ట్రీ పెద్దలతో ఫోన్లలో మంతనాలు జరిగాయి.మెగా ఫ్యామిలీ..అందరి ముందూ పెట్టిన డిమాండ్ ఒక్కటే.. రామ్ గోపాల్ వర్మపై చర్య తీసుకోవడం.
ఉన్న పళంగా చర్య తీసుకవాల్సిందేనని పవన్ కల్యాణ్ పట్టుబట్టారు. అయితే ఇండస్ట్రీ పెద్దంతా ఒక్క రోజు సమయం తీసుకుందామని చెప్పడంతో .. ఇంటికెళ్లిపోయారు. ఇరవై నాలుగ్గంటల్లో నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు. ఇంతకీ పవన్ కల్యాణ్ కోరుతున్న నిర్ణయం రామ్ గోపాల్ వర్మపై నిషేధం విధించడమేనని ప్రచారం జరుగుతోంది. అల్లు అరవింద్ ప్రెస్మీట్ లో కూడా అన్యాపదేశంగా ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. ఇండస్ట్రీలో ఎలాంటి నిర్ణయాన్నైనా ప్రభావితం చేయగల స్థితిలో ఉన్న మెగా ఫ్యామిలీ… ఆర్జీవీపై నిషేధం విధించే విషయంలోనూ తన పలుకుబడి చూపించవచ్చు. కచ్చితంగా చూపిస్తుందన్న ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే.. ఆర్జీవీ కొత్త సినిమా ఆఫీసర్ విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే ఇరవై మూడున సినిమాను రిలీజ్ చేయనున్నారు. దీనికి నిర్మాత ఆర్జీవీనే. తన ఆర్జీవీ కంపెనీ బ్యానర్ పై నిర్మించారు. నాగార్జున హీరో. ఈ సినిమా ఆగిపోతే.. ఆర్జీవీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కోవడం ఖాయం.ఉద్దేశపూర్వకంగా తమను కించ పరుస్తున్న ఆర్జీవకి ఇదే సరైన శిక్షగా మెగా ఫ్యామిలీ తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆఫీసర్ లో హీరో నాగార్జున… ఎంత ఆర్జీవీ ప్రొడ్యూసర్ అయినా.. నాగార్జున సినిమాను నిలిపివేయాలంటే.. ఇండస్ట్రీ పెద్దలకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. ఇప్పుడు ఇంజస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. మెగా ఫ్యామిలీన సంతృప్తి పరిచేందుకు నాగార్జునతో వైరం తెచ్చుకోవాలా లేక.. నాగార్జునకు సర్ది చెప్పాలో వారికి అర్థం కావడం లేదు. అదే సమయంలో… సినిమాను నిలిపివేయడం కాక.. మరేదైనా తీవ్ర చర్య దిశగా ఆలోచిస్తే బాగుటుందని సినీ పెద్దలు ఆలోచిస్తున్నారు. కానీ వవన్ కల్యాణ్ మాత్రం.. ఆర్జీవీపై నిషేధాన్నే డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.