సినిమా నిడివి విషయంలో ఇది వరకు చాలా భయాలుండేవి. రెండున్నర గంటల సినిమాల చూస్తారా? లేదా? అనేదే టెన్షన్. అందుకే వీలైనంత ట్రిమ్ చేసి వదిలేవారు. అయితే రంగస్థలం విజయంతో `నిడివి` పెద్ద సమస్య కాదని తేలిపోయింది. ఆ సినిమా దాదాపుగా మూడు గంటలొచ్చింది. భరత్ అనే నేను కూడా 2 గంటల 50 నిమిషాల ఫుటేజ్ వచ్చింది. ఇప్పుడు `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` కూడా అంతే. ఈ సినిమా లెంగ్త్ ఏంటో ఇప్పుడు తెలిసిపోయింది. 2గంటల 47 నిమిషాల నిడివి తేలింది. ఈ సినిమాని 2 గంటల 30 నిమిషాలకు కుదించాలని అనుకున్నా.. భరత్, రంగస్థలం ఇచ్చిన ధైర్యంతో మొత్తం సినిమాని వదిలేస్తున్నార్ట. మే 4న నా పేరు సూర్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రంగస్థలం, భరత్ విజయాలతో టాలీవుడ్‌కి సరికొత్త ఊపు వచ్చింది. బన్నీ సినిమా దాన్ని కంటిన్యూ చేస్తే.. టాలీవుడ్ మరింత కళకళలాడిపోవడం ఖాయం.