ప్రశాంత్ హీరోగా వచ్చిన ‘జోడి’ చిత్రంలో సిమ్రాన్ ఫ్రెండ్స్‌లో ఒకరిగా చేయడం ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన త్రిష ‘నీమనసు నాకు తెలుసు’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమై చాలా తక్కువ టైమ్‌లో తెలుగు, తమిళ భాషల్లో దాదాపు అందరు టాప్ హీరోలతో నటించి మంచి పెర్ఫార్మర్గా పేరు తెచ్చుకుంది. తన కెరీర్ అన్ని రకాల క్యారెక్టర్స్ చేసి దర్శకనిర్మాతలతోపాటు ప్రేక్షకుల్ని కూడా మెప్పించిన త్రిష ఈమధ్య కమల్‌హాసన్ హీరోగా వచ్చిన ‘చీకటి రాజ్యం’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా ఒక టిపికల్ క్యారెక్టర్ చేసింది. ఈ చిత్రంలో కమల్‌హాసన్‌తో ఆమె చేసిన ఫైట్‌లో ఆమె పెర్ఫార్మెన్స్ని స్వయంగా కమల్‌హాసనే అప్రిషియేట్ చేశాడు. త్రిష లేటెస్ట్గా తమిళ్లో ‘అరణ్మయి’కి సీక్వెల్‌గా రూపొందిన ‘అర్మణయి2’లో టైటిల్ రోల్ చేసింది. ఈ చిత్రం తెలుగులో ‘కళావతి’గా రిలీజ్ కాబోతోంది.
ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్లకు భిన్నమైన మరో క్యారెక్టర్లో ఇప్పుడు త్రిష కనిపించబోతోంది. ధనుష్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ‘కోడి’ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ వున్న క్యారెక్టర్లో త్రిష నటిస్తోంది. ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ అనే ఒక కొత్త జోనర్లో, కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా వుంటుందట. డిసెంబర్లోనే ఈ చిత్రం స్టార్ట్ కావాల్సి వుండగా చెన్నయ్‌లో వచ్చిన వరదల కారణంగా ఆలస్యంగా జనవరి 5 నుంచి షూటింగ్ స్టార్ట్ చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుస్తాయి.