నందమూరి బాలకృష్ణ వ్యక్తిగతంగా ఎంతటి భోళా మనిషి అయినా.. ఓ రాజకీయ పార్టీకి చెందిననేత. బాధ్యతాయుత ఎమ్మల్యే పదవిలో ఉన్నారు. ఆయన దానికి తగ్గట్లుగా వ్యవహరించాలి. లేకపోతే… రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గతంలో అనేక సందర్భాల్లో వివాదాస్పద వ్యాక్యలు చేసినా.. బాలకృష్ణ వెనక్కితీసుకోవడమో… ఫ్యాన్స్ గట్టిగా సపోర్ట్ గా నిలబడటమో జరిగింది. కానీ ఈ సారి సాక్షాత్తూ ప్రధానమంత్రిపైనే అభ్యంతరకర పదజాలం వాడటం సంచలనాత్మకయింది.
బాలయ్యను ఆయన అభిమానులు గుడ్డిగా సమర్థించవచ్చు. టీడీపీ కార్యకర్తలు..తప్పక అనుసరించవచ్చు. కానీ బాలకృష్ణ మాటలు సామాన్యుల్లో మాత్రం టీడీపీ ఇమేజ్ ను దెబ్బతీయడం ఖాయమన్న అంచనాలున్నాయి. ప్రధానంత్రి ఎంత మోసం అయినా చేసి ఉండవచ్చు.. ఎంతగా నమ్మించి .. హామీలు నెరవేర్చకపోయి ఉండవచ్చు కానీ.. ప్రధానిగా ఆయన గౌరవాన్ని మాత్రం ఆయకు ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎవరిదాకో ఎందుకు.. ముఖ్యమంత్రి చంద్రబాబు… మోదీ వ్యవహారశైలి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడిన ఒకే ఒక్కడు. కానీ ఆయన ఎప్పుడూ ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా తూలనాడింది లేదు. ఎంత ఆవేశం ముంచుకొచ్చినా..మోదీ గారు అనే అంటారు. కానీ ఈ సంయమనం బాలకృష్ణలో లోపించింది.
బాలకృష్ణ మంచితనంపై ఎవరికీ అనుమానాల్లేవు. కానీ ఆయన మంచి తనం..దగ్గర నుంచి చూసిన వారికే తెలుస్తుంది. కానీ కోట్ల మంది ప్రజలు.. ఆయనను దూరంగానే చూస్తారు. ఆయన మాటలు.. చేతల ద్వారనే మంచితనాన్ని అంచనా వేసుకుంటారు. ఈ రెండు విషయాల్లో బాలకృష్ణ పూర్. అభిమానుల్ని కొట్టడం.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ..ఆయన తరచూ మీడియాకు ఎక్కుతున్నారు. ప్రజల్లోకి ఇదే విషయం వెళ్తుంది. ఈ విషయంలో ఇప్పటికైనా బాలకృష్ణ జాగ్రత్త పడకపోతే.. వ్యక్తిగతంగా ఆయనకు వచ్చే నష్టం ఏమీ ఉండకపోవచ్చుకానీ.. టీడీపీకి మాత్రం తీవ్ర నష్టం కలగడం ఖాయమని ..టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.