రవితేజ అంటే మాస్… రవితేజ అంటే హుషారు… రవితేజ అంటే ఫుల్ జోష్… రవితేజ అంటే ప్రేమలోనూ కాస్త కమాండ్. ‘నేల టికేట్టు’ టీజర్లో రవితేజ నుంచి ప్రేక్షకులు, అభిమానులు కోరుకునే ఇటువంటి అంశాలు అన్నీ వున్నాయి. ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాల తరవాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన సినిమా ఇది. తొలి రెండు సినిమాల్లో కళ్యాణ్ కృష్ణ తన స్టయిల్ ఏంటో చూపించాడు. తెలుగు టచ్, నేటివ్ ఫీల్ వుంటుంది. ఈ ‘నేల టికేట్టు’ టీజర్లోనూ అది కనిపించింది. కృష్ణవంశీ సినిమా తరహాలో తెరనిండా ఆర్టిస్టులే. ‘చుట్టూ జనం… మధ్యలో మనం. అలా వుండాలిరా లైఫ్ అంటే’ – అనే డైలాగ్ హీరో క్యారెక్టర్ గురించి చెప్పింది. ఇక, ‘నేల టికేట్టు గాళ్ళతో పెట్టుకుంటే నేల నాకించేస్తది’ అనే డైలాగ్ హీరోయిజంకి ఏమాత్రం లోటు లేదని హింట్ ఇచ్చింది. మొత్తానికి టీజర్‌ని అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రవితేజ మాస్ అండ్ కామెడీ అంశాలతో కట్ చేశారు.టీజర్ చివర్లో రవితేజ విజిల్ వేస్తాడు. సినిమా కూడా ప్రేక్షకుల చేత అదే విధంగా విజిల్స్ వేయిస్తుందని ఆశిద్దాం!