‘పెళ్లి చూపుల’తో హీరోగా ఓ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండను స్టార్‌ని చేసిన సినిమా ‘అర్జున్‌రెడ్డి’. మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు కొత్త సినిమా దర్శకుడి వంక చూసేలా చేసిన సినిమా ‘అర్జున్‌రెడ్డి’. జస్ట్ రెండున్నర కోట్లతో తీసిన సినిమా ఇరవైఐదు కోట్ల కలెక్ట్ చేయగలదని నిరూపించిన సినిమా ‘అర్జున్‌రెడ్డి’. ఇలా చెప్పుకుంటే ‘అర్జున్‌రెడ్డి’ సినిమా గురించి ఎన్నో సంగతులు వుంటాయి. స్టోరీ, ట్రీట్మెంట్, టేకింగ్, మేకింగ్ అంశాలలోనూ ‘అర్జున్‌రెడ్డి’ ఒక బెంచ్ మార్క్‌గా నిలిచింది. అటువంటి సీక్వెల్ తీస్తే ఎలా వుంటుంది? బాగుంటుందని చెబుతున్నాడు విజయ్ దేవరకొండ. సీక్వెల్ గురించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగకి, తనకి మధ్య చర్చలు కూడా నడిచాయని చెప్పాడు. 40 ఏళ్ళు వచ్చిన తరవాత ‘అర్జున్‌రెడ్డి’ ఎలా వుంటాడో సీక్వెల్లో చూపిస్తే బాగుంటుందని విజయ్ దేవరకొండ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ వర్కులో సందీప్ బిజీ బిజీ. తరవాత రామ్ చరణ్ సినిమా లైనులో వుందని అంటున్నారు. ఇటు విజయ్ దేవరకొండ చేతిలోనూ రెండు మూడు సినిమాలున్నాయి. అవన్నీ పూర్తయ్యాక ‘అర్జున్ రెడ్డి’ సీక్వెల్ పట్టాలు ఎక్కుతుందేమో చూడాలి.