పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్వీట్టరే ఆయుధంగా … యుద్ధం చేస్తున్నారు. శనివారం అంతా.. టీవీ నైన్ రవిప్రకాష్ ను టార్గెట్ చేసుకున్న ఆయన… రియల్ అజ్ఞాతవాసిగా సస్పెన్స్ క్రియేట్ చేసి… అర్థరాత్రి పూట… రవిప్రకాష్ కు సంబంధించిన ఓ వీడియో బయపెట్టారు. పాతదే అయినా దాన్ని మళ్లీ వైరల్ చేయగలిగారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆర్కేను టార్గెట్ చేసుకున్నారు. ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతిలో వీకెంట్ కామెంట్ బై ఆర్కే పేరుతో.. వేమూరి రాధాకృష్ణ ఆర్టికల్ రాస్తారు. ఆ ఆర్టికల్ లో పవన్ కల్యాణ్ వ్యవహారశైలి ఈ వారం హైలెట్ అయింది. దాంతో పవన్ కల్యాణ్ ఆదివారం… ఆర్కేను టార్గెట్ చేశారు.
వేమూరి రాధాకృష్ణను విమర్శిస్తూ వరుసగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ఆర్కే ఫోటో పెట్టి గుడ్నార్నింగ్ పేరుతో ప్రారంభించి.. చిత్రవిచిత్రమైన విమర్శలు చేస్తున్నారు. ఆరెఓ సాంబ.. హుకుం సర్దార్ పేరుతో.. ఓ కార్యక్రమం తీసుకురాబోతున్నామని.. అందులో గాసిప్స్, ఫోటోలు వీడియోలు ఉంటాయని చెప్పుకొస్తున్నారు.
మొత్తానికి పవన్ కల్యాణ్ ట్విట్టర్ ఆయుధంగానే… తన పోరాటం చేస్తున్నారు. మీడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పవన్ కల్యాణ్.. తన పై దుష్ప్రచారం చేసిన, చేస్తున్న చానళ్లపై అలాంటి ప్రచారమే చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ట్వీట్టర్ యుధ్దాన్ని ప్రారంభించినట్లు భావిస్తున్నారు. తన తిక్కకు లెక్క ఉందని.. పవన్ నిరూపించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన అనుచర వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మీడియాపై పవన్ ప్రకటించిన యుద్ధం.. ఎక్కడికి వెళ్తుందో.. అన్న ఆసక్తి అంతటా వ్యక్తమవుతోంది.