తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అత్యంత పాపులర్ ఏమిటో తెలుసా..? రాజకీయాల్లో ప్రత్యేకహోదా, సినిమాల్లో భరత్ అనే నేను కావొచ్చు కానీ… టోటల్ గా అన్నీ విషయాల్లో అందరికీ… హాట్ ఫేవరేట్ గా మారింది మాత్రం సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్. ఇంత వరకూ ఫ్యాన్స్ తో సమాచారం పంచుకోవాలన్నా… ఏదేనీ కొత్త అప్ డేట్ పెట్టాలనుకున్నా.. ఫేస్ బుక్ టాప్ లో ఉండేది కానీ… గత మూడు రోజులుగా.. ఎవరూ ఫేస్ బుక్ వైపు చూడటం లేదు. అందరూ ట్విట్టర్ లోనే కాపు కాస్తున్నారు. దీనికి కారణం.. పవన్ కల్యాణ్.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ట్విట్టర్ లోనే… సస్పెన్స్ ధ్రిల్లర్ సినిమాను చూపిస్తున్నారు. రోజుకొక మీడియా సంస్థను .. దాని యజమానిని టార్గెట్ చేసుకుంటూ.. ట్వీట్ల పరంపర కొనసాగిస్తున్నారు. పవన్ ట్వీట్లు ఎప్పుడొస్తాయా అని ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఇతరులూ … ట్విట్టర్ ను ఓపెన్ చేసుకుని ఎదురు చూస్తున్నారు. పవన్ కల్యాణ్ ట్వీట్లకు.. రీ ట్వీట్లు.. లైకులు.. లక్షల్లో వస్తూండటమే… ట్విట్టర్ హవాకు నిదర్శనంగా చెప్పుకోచ్చు. ఈ ఉత్సాహం చూసి పవన్ కల్యాణ్ కూడా.. సినీ టైప్ మసాలా జోడించి… సస్పెన్స్ ధ్రిల్లర్ ట్వీట్లు పెడుతున్నారు.
పవన్ ఒక్కడే కాదు… పవన్ కు కౌంటర్ ఇవ్వడానికి ఆర్జీవీ కూడా… ఈ ట్విట్టర్ లోనే బ్యాటింగ్ చేస్తున్నారు. నిజానికి పవన్ కల్యాణ్ గతంలో ట్విట్టర్ లో కొన్ని పార్టీ సంబంధింత వ్యవహారాలను మాత్రమే పోస్టు చేసేవారు. కానీ ఇప్పుడు తన పంధా పూర్తిగా మార్చుకున్నారు. కానీ ఆర్జీవీ మాత్రం ట్విట్టర్ ను ముందు నుంచీ.. తన పబ్లిసిటీకి బెంచ్ మార్క్ గా వాడుకుంటున్నారు. దాన్ని అన్ని రకాల వ్యక్తులపై గురి పెట్టేవారు. పవన్ పై అయితే మరింత ఎక్కువగా గురి పెట్టేవారు.
మీడియాపై పవన్ చేస్తున్న ట్విట్టర్ వార్.. కౌంటర్ ఇచ్చేందుకు ఆర్జీవీ ఇన్వాల్వ్ అవుతున్న విధానం.. మొత్తానికి ట్విట్టర్ ను… సూపర్ స్టార్ గా మార్చాయి. సినిమా హాల్లో కూడా దొరకని… సస్పెన్స్ ధ్రిల్లర్ రియాలిటీషో ను మంచిని ఇన్ఫోటెయిన్ మెంట్ ట్విట్టర్ ద్వారా లభిస్తోంది. అందుకే ట్విట్టర్.. ట్విట్టరో.. ట్విట్టరోస్య.. అంటూ అందరూ.. ట్విట్టర్ కూతల కోసం ఎదురుచూస్తున్నారు.