రాజకీయానికైనా, సినిమాకైనా మీడియాతో సత్సంబంధాలు చాలా అవసరం. సోషల్ మీడియా ఇప్పుడు పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా… క్రెడిబులిటి మాత్రం లేదు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని గాలి ప్రచారారంగానే నమ్ముతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తేనే జనం కనెక్ట్ అవుతున్నారు. అందుకే ఇప్పటికి ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు ఏ మాత్రం పరపతి తగ్గలేదు. రాజకీయం, సినిమా మీడియాతో సన్నిహిత సంబంధాలకు … ప్రాముఖ్యత ఇస్తూనే ఉన్నాయి.
టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ అంటే.. ఇండస్ట్రీలో సగం అన్న పేరు ఉంది. క్రికెట్ జట్టుగా ఆడుకోగలినంత మంది హీరోలు ఉన్నారు. మరికొంత మంది ఆరంగేట్రానికి సిద్ధమవుతున్నారు. ఇటు చిరంజీవి ఫ్యామిలీ నుంచి.. అటు అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి ఏడాదికొకరు చెప్పున కొత్త హీరో పరిచయమవుతున్నారు. అందర్నీ ప్రేక్షకులకు దగ్గర చేయాల్సింది మీడియానే. అందుకే… మెగా కాంపౌండ్ మీడియాకు వీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తుంది. ఎప్పుడూ మీడియాను దూరం చేసుకునే పనులు చేయలేదు.
కానీ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ మీడియాతోనే యుద్ధం ప్రకటించారు. పవన్ వ్యవహారశైలి… యువ హీరోలకు ఇబ్బందికరంగా మారుతుందన్న ఆందోళన..మెగా ఫ్యామిలీలో ప్రారంభమయింది. ఈ విషయంపై పవన్ కల్యాణ్ కు కొంత మంది సన్నిహితులు చెప్పే ప్రయత్నం చేసినా ఆయన కేర్ చేయడం లేదని సమాచారం. పవన్ కల్యాణ్.. మొదటి నుంచి తన వ్యవహారాల్లో ఎవర్నీ వేలు పెట్టనివ్వరు.ఇప్పుడూ.. తన పోరాటం తనదేనని… ఎవరికో.. ఏదో అయిపోతుందని.. తాను వెనక్కి తగ్గనని చెబుతున్నారట. దీంతో మెగా ఫ్యామిలీలో పలువురు… పవన్ తీరుపై కినుక వహించారని ప్రచారం జరుగుతోంది.