`చెప్పను బ్రదర్` అనే డైలాగ్‌ని పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. ఆ ఒక్క మాట.. అల్లు అర్జున్ తో చెడుగుడు ఆడేసుకుంది. బన్నీకి యాంటీ ఫ్యాన్స్పెరగడంలో `చెప్పను బ్రదర్` డైలాగ్ కీలక పాత్ర వహించింది. పవన్‌కీ బన్నీకీ పడదన్న విషయం మెగా ఫ్యాన్స్‌కి చేరేసింది ఆ మాటే. అయితే ఇప్పుడు పవన్‌కి దగ్గరైపోయాడు బన్నీ. ఇటీవల జరిగిన పరిణామాలు మెగా కుటుంబాన్ని ఏక తాటిపైకి తీసుకొచ్చాయి. ఫిల్మ్ ఛాంబర్లో పవన్ కనిపించగానే. ఆత్మీయంగా అలింగనం చేసుకున్న ఫొటో.. మెగా ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. సో.. పవన్‌కీ బన్నీకీ మధ్య ఉన్న కమ్యునికేషన్ గ్యాప్ ఫిల్ అయిపోయిందనే చెప్పాలి.
కాకపోతే ఈమైత్రి ప్లస్సా? మైనస్సా? అనేదే కీలకం. శ్రీరెడ్డి గొడవలు, మీడియాతో వైరం ఇవేం లేకపోతే.. బన్నీ కి పవన్ మైత్రి మేలు చేసి పెట్టేదే. తన సినిమా `నాపేరు సూర్య` త్వరలోనే విడుదల అవుతోంది. కాబట్టి పవన్ ఫ్యాన్స్‌ని తన దారిలోకి తెచ్చుకుని కలక్షన్లు పెంచుకోవొచ్చు. కాకపోతే.. పవన్ యాంటీ ఫ్యాన్స్ నీ బన్నీ ఇప్పుడు తట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. పవన్‌ని, పవన్ వర్గీయుల్ని, పవన్‌ని సపోర్ట్ చేస్తున్నవాళ్లని ఇబ్బంది పెట్టడానికి ఎవరు ఎలాంటి మార్గాలనైనా ఎంచుకుంటారు. ఇప్పుడు బన్నీ సినిమాకీ అలాంటి సవాళ్లు ఎదురుకావొచ్చు. సినిమాని కేవలం సినిమాగా చూసే రోజులు పోయాయి. వాటికీ కులాలు, రాజకీయాలు జోడిస్తున్నారు. ఆ లెక్కన సూర్యపై పవన్ నెగిటీవ్ ఫ్యాన్స్ ఎఫెక్ట్ పడే అవకాశం పుష్కలంగా ఉంది. కాకపోతే సినిమా లెక్కలు వేసుకోకుండా బన్నీ పవన్‌తో భుజం కలిపాడు. ఇలాంటి సెట్యువేషన్ లేనప్పుడు బన్నీ తనకు తానుగా ముందుకొచ్చి, పవన్ భుజాలపై చేతులు వేసి నడిస్తే.. తన సినిమా ప్రమోషన్లకు పవన్‌ని వాడుకుంటున్నాడేమో అనుకోవొచ్చు. కానీ.. ఇప్పుడున్న పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంది. ఈ సమయంలో.. బన్నీ ముందుకొచ్చాడంటే.. కచ్చితంగా ప్లస్సులతో పాటు మైనస్సుల్నీ స్వీకరించడానికి సిద్ధపడ్డాడన్నమాటే.