అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి మహేష్ బాబు ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘నాకు సందీప్ ఇంకా కథ చెప్పలేదు’ అని మహేష్ చెబుతున్నా… వీరిద్దరి మధ్య కథకు సంబంధించిన చర్చలైతే జరిగాయి. సందీప్‌తో సినిమా చేయడానికి మహేష్ కూడారెడీ అయిపోయాడు. అయితే ఇప్పుడు ‘రంగస్థలం’ సినిమా చూసి.. సుకుమార్ వైపు టర్న్ తీసుకున్నాడు మహేష్. సుక్కుతో మాట్లాడి, సినిమా ఓకే చేయించేశాడు. అందుకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. వంశీ పైడిపల్లితో సినిమా ముగిసిన వెంటనే.. సుకుమార్ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. అంటే సందీప్ రెడ్డి మహేష్‌తో సినిమా చేయాలంటే 2020 వరకూ ఆగాలన్నమాట. అప్పటికి రాజెవరో, బంటెవరో?? మహేష్ కోసం ఇన్నాళ్లూ కలలు కన్న సందీప్‌కి.. నిజంగా ఇది షాకే. మహేష్ కోసం రాసుకుంటున్న కథ పక్కన పెట్టి, మరో హీరో కోసం మరో స్క్రిప్టు సిద్ధం చేసుకోవాల్సిందే. సందీప్‌కి హీరోల కొరత ఉండకపోవొచ్చు. అర్జున్ రెడ్డి ఫీవర్‌తో పెద్ద హీరోలు సైతం సందీప్‌తో సినిమా చేయడానికి ముందుకొస్తారు. అయితే ఆ బడా హీరోలెవరూ ప్రస్తుతానికి ఖాళీగా లేరు. కాబట్టి.. మరోసారి యంగ్ హీరోలతోనే సర్దుకుపోవాలి.