ఇప్పటికే భరత్ అనే నేను మూడు గంటల సినిమా వచ్చింది. నిడివి దృష్ట్యా చాలా సన్నివేశాల్ని తొలగించాల్సివచ్చింది. అందులో ఓ ఫైటు కూడా ఉంది. హోళీ నేపథ్యంలో చిత్రీకరించిన ఆ ఫైటు.. నిడివి సమస్య వల్ల తొలగించారు. ఇప్పుడు ఆ ఫైటు మళ్లీ జోడించబోతున్నారు. ఇది వరకు `మిర్చి`లో కూడా ఓ పోరాట ఘట్టాన్ని విడుదల తరవాత కలిపారు. ఆ ఫైట్ చూడ్డానికి ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ థియేటర్‌కి వెళ్లారు. ఇప్పుడు భరత్ అనే నేనుకి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని ఈ సినిమా నిర్మాత, పంపిణీదారుల ఆశ. ఇప్పటికే వసూళ్లు వరదలా పారుతున్నాయి. ఆ హంగామా కాస్త తగ్గాక.. ఈ ఫైట్‌ని జోడించే అవకాశం ఉంది.