సూపర్‌స్టార్ రజనీకాంత్.. కుమార్తె సౌందర్య కోసం తన ఇమేజ్‌ని పక్కనపెట్టి ‘కొచ్చడయాన్’ పేరుతో ఓ యానిమేషన్ మూవీ చేసిన విషయం తెలిసిందే. ఇది రజనీకాంత్ కెరీర్లో ఆల్‌టైమ్ టాప్ డిజాస్టర్‌గా పేరు తెచ్చుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళ్‌తోపాటు తెలుగు, మలయాళం, మరాఠి, భోజ్‌పురి, బెంగాలీ భాషల్లో రిలీజ్ అయి సేమ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు కన్నడలో కూడా రిలీజ్ కాబోతోంది. కర్ణాటకలో డబ్బింగ్ సినిమాలను 50 ఏళ్ళ క్రితం నిషేధించారు. స్ట్రెయిట్ సినిమాలనే కర్ణాటకలో రిలీజ్ చెయ్యాలి తప్ప డబ్బింగ్ సినిమాలకు అక్కడ అవకాశం లేదు. తెలుగులో సూపర్‌హిట్ చిత్రంగా, క్లాసిక్ మూవీగా నిలిచిన ‘మాయాబజార్’ చిత్రాన్ని 1965లో కన్నడలోకి అనువదించి కర్ణాటకలో రిలీజ్ చేశారు. కర్ణాటకలో అదే చివరి డబ్బింగ్ సినిమా. 50 ఏళ్ళ తర్వాత డబ్బింగ్ సినిమాలపై వున్న నిషేధాన్ని కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఎత్తేసింది. 50 ఏళ్ళ తర్వాత కన్నడలో డబ్బింగ్ అయి రిలీజ్ అవుతున్న మొదటి చిత్రంగా ‘కొచ్చడయాన్’ రికార్డ్ క్రియేట్ చెయ్యబోతోంది.