మహేష్‌బాబుకి కొన్ని సెంటిమెంట్లుంటాయి. తన సినిమా ఓపెనింగ్ రోజు మహేష్ రాడు. పూజా కార్యక్రమాల్లో కనిపించడు. వీలైనంత వరకూ మూడక్షరాల పేర్లకు ప్రాధాన్యం ఇస్తాడు. తను నటించిన ఏ కథానాయికనీ దాదాపుగా రిపీట్ చేయడు. ఇప్పుడు మరో సెంటిమెంట్ జత కట్టిందనిపిస్తోంది. బ్రహ్మాజీ తన టీమ్ లో ఉండడం మహేష్ కి సెంటిమెంట్‌గా మారిందనిపిస్తోంది. అతడు నుంచి భరత్ అనే నేను సినిమా వరకూ బ్రహ్మాజీ ఉన్న మహేష్ బాబు సినిమాలన్నీ బాగా ఆడాయి. మరీ ముఖ్యంగా భరత్ అనే నేనులో మహేష్ – బ్రహ్మాజీల మధ్య సీన్లు బాగా పండాయి. ఈ సెంటిమెంట్‌ని మహేష్ గుర్తు చేశాడు కూడా. ”బ్రహ్మాజీ తో కలసి నటించిన సినిమాల్లో దాదాపు 90 శాతం బ్లాక్ బ్లస్టర్లే” అంటూ భరత్ అనే నేను సక్సెస్‌మీట్‌లో గుర్తు చేసుకున్నాడు మహేష్. ఇక మీదట కూడా మహేష్ ఈ సెంటిమెంట్‌ని కొనసాగిస్తాడేమో చూడాలి.