జనసేన అధినేత పవన్ కల్యాణ్… గత వారం రోజుల్నుంటి ట్విట్టర్ లో వేడి మీద ఉన్నారు. ప్రసిద్ధ మీడియా సంస్థల అధిపతులను టార్గెట్ చేసుకోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. అత్యంత రహస్యాలను.. ఏమీ బయటపెట్టడం లేదు కానీ… ఆయా మీడియా సంస్థల అధినేతలకు సంబంధించిన పాత విషాయలను మళ్లీ మళ్లీ ట్రెండింగ్ లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. పవన్ కల్యాణ్ కు … కొంత మంది ఆర్టిస్టుల నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా బుల్లితెర ఆర్టిస్టులు.. పవన్ కోసం ప్రాణాలిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. జబర్దస్త్ లాంటి షోల ఆర్టిస్టులైతే.. పవన్ కు మద్దతుగా ప్రభుత్వాలపై కూడా నెగెటివ్ కామెంట్లు పెట్టడానికి వెనుకాడటం లేదు.
వీరివి వర్జినల్ ఎకౌంట్లో… రియల్ సోషల్ ఎకౌంట్లో కూడా అర్థం చేసుకోవడం కష్టం అయినంత ఘాటుగా.. హార్డ్ కోర్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ లా పోస్టులు పెడుతున్నారు. వీరి పోస్టులు చూసి.. నెటిజన్లు.. అతి వినయం ధూర్త లక్షణం అనే సామెతను గుర్తు చేసుకుని… అతి అభిమానం ధూర్త లక్షణం అంటూ సెటైర్లు వేస్తున్నారు. వీళ్లది అసలు అభిమానమే కాదంటున్నారు. దానికి కొంత లాజిక్ కూడా జమ చేస్తున్నారు.
బుల్లితెర ఆర్టిస్టులు, పెద్దగా అవకాశాల్లేని ఆర్టిస్టులకు.. వెండితెర అవకాశాలు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వీరికి ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ ఉండదు. ఏదైనా సపోర్ట్ కోసం ప్రయత్నిస్తూంటారు. తమను అభిమానించే వారికి మెగా కాంపౌండ్ అండగా ఉంటుంది. ఈ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. కత్తి మహేష్ పై … ఓ రకంగా యుద్ధం చేసిన హైపర్ ఆదికి… మెగా హీరో.. వరుణ్ తేజ్ తొలి ప్రేమ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్ దక్కింది. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉండటంతో.. ఆర్టిస్టులు.. పవన్ కల్యాణ్ పై విపరీతమైన అభిమానం చూపించడం ప్రారంభిస్తున్నారు. వీరిలో ఎక్కువగా..అవకాశాలు దక్కించుకోవాలన్న ఆశ తప్ప.. నిజంగా పవన కల్యాణ్ పై అభిమానంతో… ఈ సోషల్ మీడియా సపోర్ట్ చేయడం లేదని చాలా మంది విశ్లేషిస్తున్నారు. ఇందులో నిజం కూడా ఉండవచ్చు.. ఎందుంటే… ఫిల్మ్ ఇండస్ట్రీలో… కనిపించేది మొదట హిపోక్రసీనే.