ఈ వేసవిలో వరుసగా రెండు బ్లాక్బస్టర్లు చూసింది చిత్రసీమ. రంగస్థలం, భరత్ అనే నేను.. రెండూ వంద కోట్ల సినిమాలే. నాన్ బాహుబలి రికార్డు నీదా? నాదా ? అనే రేంజులో తలపడబోతున్నాయి. ఈ హడావుడిలో మరో సినిమా రావడం, నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని. రంగస్థలం ఊపులో వచ్చిన ‘ఛల్ మోహనరంగ’ పరిస్థితి ఏమైందో మనందరికీ తెలుసు. నితిన్ ఇమేజ్, పవన్ – త్రివిక్రమ్‌ల బ్రాండ్ ఈసినిమాని నిలబెట్టలేకపోయింది. మరో సీజన్లో వస్తే.. కాస్తో కూస్తో వసూళ్లు దక్కేవి. రంగస్థలం మూడ్‌లో వచ్చి ఇరుక్కుపోయింది. భరత్ అనే నేను ఊపులో ఏ సినిమా వచ్చినా నిలబడేట్టు కనిపించం లేదు. ఈనెల 27న `ఆచారి అమెరికా యాత్ర` వస్తోంది. రెండు మూడుసార్లు వాయిదా పడిన అనంతరం.. ఆచారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈసినిమాకి సరైన పబ్లిసిటీ లేదు. అసలు వస్తుందా, రాదా? అనే డౌటు ఇంకా కొడుతూనే ఉంది. ఆచారి కంటే.. ‘కణం’ సినిమాకే కాస్తో కూస్తో పబ్లిసిటీ దొరికింది. పైగా.. `ఛలో` తరవాత వస్తున్న నాగశౌర్య సినిమా ఇది. అన్నింటికంటే ముఖ్యంగా సాయి పల్లవి ఉంది. ఇది చాలు. జనాలు థియేటర్లకు వెళ్లడానికి. విష్ణుకి వరుసగా ఫ్లాపులే. ఆచారికీ హైపు రాలేదు. పబ్లిసిటీ అస్సలు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆచారికి ఆదరణ దక్కుతుందా? అనేది అనుమానమే.