కలక్షన్ కింగ్ మోహన్‌బాబు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన కుటుంబం తనతో పాటే ఉంది. ప్రస్తుతం ఆయనకు ఓ మేజర్ ఆపరేషన్ జరుగుతోంది. ఇటీవల ఆయనకు భుజానికి గాయమైంది. ఆ బాధతోనే ‘గాయత్రి’ కోసం ఫైటింగులు కూడా చేశారు. ఆ సమయంలో గాయం మరింత ఎక్కువైంది. ఇప్పుడు ఆ సర్జరీ కోసమే అమెరికా వెళ్లింది మంచు కుటుంబం. విష్ణు నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ ఈ వారం విడుదల కాబోతోంది. తండ్రికి తోడుగా అమెరికా వెళ్లిన విష్ణు ప్రస్తుతం అక్కడే ఉన్నారు. దాంతో విష్ణు లేకుండానే ‘ఆచారి అమెరికా యాత్ర’ ప్రమోషన్లు జరిగిపోతున్నాయి. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించింది. బ్రహ్మానందం కీలక పాత్రధారి. ‘గాయత్రి’ ఫ్లాప్‌తో విష్ణు కెరీర్ మరింత కుదుపునకు లోనైంది. ఈ సినిమా వర్కవుట్ అయితే గనుక… ‘ఓటర్’ ఆగమనానికి కాస్త దారి దొరికినట్టవుతుంది.