ముహూర్తం ఫిక్సయింది. ఏర్పాట్లు జరిగిపోయాయి. ఫ్లెక్సీలు కూడా కట్టేశారు. ఇక ఊరేగింపుగా వెళ్లి చేరడమే మిగిలింది. కానీ అంతలోనే… అసలు వ్యక్తి హైబీపీ పేరుతో ఆస్పత్రిలో చేరిపోయారు. రెండు రోజుల విశ్రాంతి అసరమని డాక్టర్లు తేల్చారు. దాంతో అసలు కార్యక్రమం వాయిదా పడింది. సీక్వెన్స్ ప్రకారం చూస్తే.. ఇందులో అనుమానించాల్సిందేమీ లేదు. కానీ రాజకీయాల్లో మాత్రం కచ్చితగా డౌటానుమానం పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే… కన్నా- వైసీపీ జాయింగ్ విషయంలో జరుగుతున్న వ్యవహారాలు అలాగే ఉన్నాయి. ఇంత వరకూ వైసీపీ నేతలు కానీ.. జగన్ మీడియా కానీ ఎక్కడా కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరబోతున్నారని బహిరంగంగా ప్రకటించలేదు. కానీ కన్నా బీజేపీకి నాజీనామా చేశారనే విషయాన్ని మాత్రం జగన్ మీడియా హైలెట్ చేసింది. అదే సమయంలో కన్నా కూడా అధికారిక ప్రకటన చేయలేదు. ఆయన అనుచరరులు కార్యకర్తలు మాత్రం వైసీపీలో చేరబోతున్నట్లు.. కన్నా ఇంటి చుట్టూ ఫ్లెక్సీలు వేసేశారు. కన్నా పర్మిషన్ లేకుండా ఇలా వేయరు.
మరి చివరి క్షణంలో…నిజంగానే అనారోగ్యానికి గురయ్యారా.. లేక … అంతర్గతంగా ఏమైనా జరిగిందా.. అనే అనుమానాలు.. ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కన్నా ప్రముఖ నేత. గుంటూరులో రాజకీయ సమీకరణాలు మార్చగల నేత. ఆయన పార్టీలో చేరాలనుకుంటున్నప్పుడు… వైసీపీ అధినేత నుంచి కొన్ని క్లారిటీలు కోరాడని.. దానిపై స్పష్టత రాకపోవడంతోనే.. వైసీపీలో చేరికను వాయిదా వేసుకున్నారన్న ప్రచారం గుంటూరుోల సాగుతోంది. తనకు తన అనుచరునికి టిక్కెట్ ఖరారు చేస్తున్నట్ుల… చేరిక సమయంలోనే ప్రకటన చేయాలని కన్నా పట్టుబట్టారనట. కానీ దానికి జగన్ అంగీకరించలేదని సమాచారం.
కన్నా డిమాండ్లపై జగన్ వైపు నుంచి పెద్దగా సానుకూలత లేకపోయినా ముందుగానే చేరిక తేదీని లీక్ చేసి.. కన్నా వర్గీయులు తప్పు చేశారని కొంత మంది భావిస్తున్నారు. కానీ కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాల్లో పండిపోయిన వ్యక్తి. జగన్ పై ఒత్తిడి పెంచడం కోసం.. ఆయన ఈ రాజకీయాన్ని నడిపిస్తున్నాడన్న ప్రచారం కూడా ఉంది. తనకు టీడీపీ కూడా ఆహ్వానం పలుకుతోందన్న ఫీలర్లు ఆయన వైసీపీకి పంపుతున్నారు. అంటే ఇప్పుడు జగనే.. కన్నా డిమాండ్లపై ఏదో ఒకటి తేల్చాల్సి ఉంది. నిప్పులేనిదే పొగరాదన్నట్లు… ఓ నేత చేరిక వాయిదా పడటం అంటే… కచ్చితంగా గాసిప్స్ బయటకు వస్తాయి. అందులో ఎంతో కొంత నిజం ఉంటుంది. ఏం జరిగిందనేది ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.