పవన్ కల్యాణ్ కొద్ది రోజుల కిందట.. తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఓ టీవీ చానల్ లో తన తల్లిని తట్టినట్లుగా ఉన్న వీడియోను ప్రసారం చేశారని… ఆయన ఆరోపించారు. నిజానికి ఆ వీడియో క్లిప్ ఆ .. టీవీ చానల్ ప్రసారం చేసినది కాదు. మ్యూట్ చేసిన ఆడియోను… మార్ఫింగ్ చేసి… పవన్ కల్యాణ్ ట్వీట్టర్ పోస్ట్ చేశారు. కుట్రతోనే పవన్ కల్యాణ్ ఇలా చేశారని జర్నలిస్టు సంఘాలు.. పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదు మీద విచారణ జరిపిన పోలీసులు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించి కేసు నమోదు చేశారు.
ఐపీసీ 469, 504, 506 సెక్షన్ల కింద కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారం..మార్ఫింగ్, కుట్రపన్ని పేరు ప్రఖ్యాతలకు నష్టం కలిగించేలా ప్రచారం చేయడం లాంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ సెక్షన్ల కింద నమోదైన ఈ కేసుల్లో నేర నిరూపరణ జరిగితే.. గరిష్టంగా ఏడేళ్లు… కనిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. జరిమానా దీనికి అదనం. పవన్ ట్వీట్లకు సంబంధించిన పూర్తి టెక్నికల్ సమాచారం…. జర్నలిస్టు సంఘాలు పోలీసులకు ఇచ్చాయని సమాచారం. పవన్ కల్యాణ్ పోస్ట్ చేసిన ఐపీ అడ్రస్‌ని పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఆ ఐపీ అడ్రస్ పవన్ కల్యాణ్ దేనని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ఏప్రిల్ 20వ తేదీన తెల్లవారుజాము నుంచి నాలుగైదు రోజుల పాటు నాలుగు రోజుల పాటు మీడియా సంస్థలను టార్గెట్ చేస్తూ.. వాటి యాజమాన్యాలను విమర్శిస్తూ ట్విట్టర్ లో రచ్చ చేశారు. మీడియా చానళ్లపై కూడా పవన్ కల్యాణ్ గతంలో ఫిర్యాదు చేశారు. స్వయంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. కంప్లైంట్ ఇచ్చారు. రెండు రోజుల పాటు.. లాయర్లతో చర్చలు జరిపి మరీ పవన్ చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఇంకా ఏ చర్యలు తీసుకోలేదు.