కాజల్ అగర్వాల్ చాలామంది హీరోలకు లక్కీ మస్కట్. బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించింది. కొంతమంది హీరోలతో రెండు మూడు సినిమాలు చేసి హిట్ పెయిర్ అని స్టాంప్ వేయించుకుంది. బట్, మాస్ మహారాజ్ రవితేజతో కాజల్ కాంబినేషన్ హిట్ పెయిర్ కాదు. రవితేజకు జంటగా ఆమె నటించిన రెండు సినిమాలూ ఫ్లాపే. రెండిటిలో ‘వీర’ డిజాస్టర్ కాగా… ‘సారొచ్చారు’ పర్వాలేదు. ముచ్చటగా మూడోసారి వీళ్ళిద్దరూ జంటగా నటించనున్నారని ఫిలింనగర్ టాక్. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న సినిమాలో మెయిన్ హీరోయిన్గా కాజల్‌ని సెలెక్ట్ చేశారని సమాచారం. ఇందులో మరో హీరోయిన్గా కేథరిన్ త్రెసా నటించనుంది. ముందు ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ కోసం ప్రిపేర్ చేశారు. అయితే.. పవన్ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టడంతో మరో హీరోతో సినిమా చేయడానికి అతడి దగ్గర అనుమతి తీసుకున్న దర్శక నిర్మాతలు రవితేజతో సినిమా చేస్తున్నారు.