సూపర్ స్టార్ మహేష్ బాబుని కోట్ల మంది అభిమానిస్తారు. కానీ మహేష్ బాబు మాత్రం ఒక్కరినే అభిమానిస్తారు. ఆయనే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. సొంత బావ అయిన గల్లా జయదేవ్‌ను ఎక్కువగా అభిమానిస్తారు. ఆయన సలహాలను… ఎక్కువగా పాటిస్తూంటారు . అయితే ఇప్పుడు… మహేష్ బాబు ఫ్యాన్ లిస్టులో రెండో వ్యక్తి చేరారు. ఆ వ్యక్తి ఎవరో కాదు…మహేష్ కు రెండు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన కొరటాల శివ. ట్విట్టర్ లో మహేష్ బాబును మిలియన్ల మంది ఫ్యాన్స్ ఫాలో అవుతూంటారు.. కానీ మహేష్ బాబు మాత్రం గల్లా జయదేవ్ ను మాత్రమే ఫాలో అవుతారు. ఇప్పుడు ఆ లిస్టులో కొరటాల శివను చేర్చుకున్నారు మహేష్ బాబు.
గతంలో సరైన హిట్ లేని సందదర్భంలో శ్రీమంతుడు సినిమాతో.. కొరటాల శివ… మహేష్ కెరీర్ కి టర్నింగ్ హిట్ ఇచ్చారు. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా… రికార్డులు సృష్టించింది. బాహుబలి లాంటి సినిమా ప్రభంజనాన్ని కూడా తట్టుకుని నాన్ బాహుబలి సినిమాల్లో నెంబర్ వన్ గా నిలిచింది. ఇప్పుడు.. వరుసగా రెండు సూపర్ ఫ్లాప్ సినిమాలతో మళ్లీ ఇబ్బందుల్లో పడిన మహేష్ కు.. కొరటాల శివ… భరత్ అనే నేను సినిమాతో .. మరో బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చారు. రాజకీయ కథాంశంతో తీసినా..ఎవరిపైనా.. కనీసం మాట తూలకుండా.. ఎవర్నీ నొప్పించకుండా.. సినిమా తీసి.. తాను మూవీ మేకింగ్ లో మాస్టర్ నని నిరూపించుకున్నారు. మాస్ , మసాలా కాకపోయినా.. మహేష్ స్టామినాను మరో రెండు మెట్లు ఎక్కించింది ఈ సినిమా. దీంతో మహేష్ బాబు.. కొరటాలశివ టాలెంట్‌కు ఫిదా అయిపోయారు. విజయవాడ టూర్ లో… మీడియాతో మాట్లాడినప్పుడు ఆప్యాయంగా కొరటాల శివను హత్తుకుని… తన ఆనందాన్ని బహిరంగంగానే ఎక్స్ ప్రెస్ చేశారు మహేష్ బాబు.
గతంలో శ్రీమంతుడు సినిమా హిట్ అయినప్పుడు.. ఆ అనందాన్ని మహేష్ బాబు…వినూత్నంగా వ్యక్తం చేశారు. ఖరీదైన కారును కొరటాల శివకు బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అంతకంటే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శివకు… ఖరీదుతో వెలకట్టలేని అభిమానాన్ని ఇచ్చారు. తాను అత్యంత అభిమానించే.. గల్లా జయదేవ్ తర్వాతి స్థానాన్ని కొరటాల శివకు ఇచ్చారు. కొరటాల కూడా.. మహేష్ లెటెస్ట్ గిఫ్ట్ తో ఖుషీ అయిపోయి ఉంటారు.