నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ మూవీకి దర్శకుడు ఎవరన్నదానిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. తన వల్ల కాదని తేజ తప్పుకున్న తర్వాత ప్రముఖ దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. చివరికి బాలకృష్ణే దర్శకత్వం చేపట్టాలనే యోచన చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ దర్శకత్వ ఆరంగేట్రం చేయాడానికి ఇంత కన్నా చారిత్రాత్మక అవకాశం దొరకదని అభిమానులు కూడా సంబరపడుతున్నారు. తండ్రిని ఎన్టీఆర్ను దగ్గర నుండి చూసిన వ్యక్తిగా…బాలకృష్ణ అయితేనే దర్శకునిగా బయోపిక్ మూవీకి వందకు వంద శాతం న్యాయం చేస్తారన్న అభిప్రాయం ఎన్టీఆర్ అభిమానుల్లోనూ ఉంది.
నిజానికి బాలకృష్ణ దర్శకునిగా ఒకే ఒక్క సినిమా చేయాలనుకున్నారు. అదే నర్తనశాల. 2004 మార్చి ఒకటో తేదీన దీనికి రామోజీ ఫిల్మ్ సిటీలో ముహుర్తం జరిపారు. ఎన్టీఆర్ నర్తనశాలకు ఇది రీమేక్. కథ మొత్తం రెడీ అయింది. ఆర్టిస్టుల ఎంపిక కూడా పూర్తయింది. ద్రౌపదిగా సౌందర్యను ఎంపిక చేశారు. ముహుర్తం షాట్ కూడా ఆమె మీద చిత్రీకరించారు. శ్రీహరి, ఉదయ్ కిరణ్, సాయికుమార్ లాంటి వాళ్లను.. ఇతర పాత్రలకు ఎంపిక చేశారు. కానీ దురదృష్టవశాత్తూ.. సినిమా షూటింగ్ ముహుర్తం జరుపుకున్న నెలన్నరలోనే అంటే 2004 ఏప్రిల్ పదిహేడో తేదీన హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించారు. ద్రౌపది పాత్రకు.. మరెవ్వరూ న్యాయం చేయలేరనుకున్న బాలకృష్ణ సినిమాను ఆపేయాలని నిర్ణయించుకున్నారు. అలా బాలకృష్ణ దర్శకత్వ ఆరంగేట్రానికి అప్పుడు తెర పడింది.
కానీ ఇప్పుడు పరిస్థితులు కలసి వస్తున్నాయి. బాలకృష్ణ దర్శక్వం చేయాల్సిన మెగా ప్రాజెక్ట్… నర్తనశాల కాదని.. ఎన్టీఆర్ బయోపిక్ అని…ఆయనకు అలా రాసి పెట్టి ఉందని అభిమానులు సంబర పడుతున్నారు. బాలకృష్ణ రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా… ఎన్టీఆర్ బయోపిక్కు దర్శకత్వం వహిస్తేనే.. చరిత్రలో ఆ సినిమా నిలిచిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. బాలకృష్ణకు..మైల్ స్టోన్ మూవీస్ అలా కలసి వస్తున్నాయి. వందో సినిమాగా రైతు సబ్జెక్ట్ తో ఓ సినిమా అనుకున్నారు. కానీ క్రిష్ గౌతమీ పుత్ర శాతకర్ణి కథతో ముందుకు
వచ్చారు. దాంతో బాలకృష్ణ వందో సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు బాలకృష్ణ దర్శకత్వంలోనే.. ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కేలా పరిస్థితులు మారుతూండటం.. అంతా పెద్దాయన ఆశీస్సులే అంటున్నారు ఫ్యాన్స్. నిర్ణయం బాలకృష్ణ చేతుల్లోనే ఉంది.