సంగీత దర్శకులు అప్పుడప్పుడూ ప్రైవేటు ఆల్బమ్ చేస్తూ తమ అభిరుచిని చాటుకుంటుంటారు. మిక్కీ జె.మేయర్కీ ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేయాలన్న ఆలోచన ఉందట. ఈ విషయాన్ని మిక్కీనే స్వయంగా చెప్పాడు. ”ఆంధ్రా, తెలంగాణ ఫోక్ సంస్క్రృతి ప్రతిబించేంలా ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేయాలని వుంది. దాని కోసం చాలా పెద్ద రిసెర్చ్ చేయాలి, కనీసం ఐదేళ్లయినా పడుతుంది” అంటున్నాడు మిక్కీ. ప్రస్తుతం ‘మహానటి’ రీ రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు మిక్కీ. ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. ఈ రెండు పాటలకూ వస్తున్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు మిక్కీ. ”సావిత్రిగారంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఆమె సినిమాలు చాలా చూశా. కానీ ఆమె నిజ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలీదు. నాలానే చాలామంది సావిత్రిగారి అభిమానులకు ఆ సంగతులేం తెలీవు. అవన్నీ ‘మహానటి’లో చూడబోతున్నారు. ఇలాంటి చిత్రాలకు సంగీతం అందించడం దర్శకుడిగా నాకు ఛాలెంజ్. పాటలు ఆతరానికే కాదు, ఇప్పటి జనరేషన్కీ అర్థమయ్యేలా, నచ్చేలా ఉండాలి. ఆ ప్రయత్నం `మహానటి` పాటల ద్వారా చేయగలిగా” అంటున్నాడు మిక్కీ.