తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన యుగపురుషుని పేరు వివాదం చేసి ఓట్ల వేట సాగించాలన్న రాజకీయ వ్యూహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోంది. నిమ్మకూరులో కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని జగన్ ప్రకటించిన ంతర్వాత టీడీపీ నేతలనుంచి అనేక విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్ పేరు ఎత్తే అర్హత జగన్ కు లేదని… మండిపడ్డారు. వైఎస్ పేరు చెబితే ఓట్లు రాలడం లేదని ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.అయితే ఈ విషయంలో జగన్ ఇంకా లోతైన వ్యూహంతో ఉన్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. జగన్ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ పార్టీకి చెందిన రాష్ట్ర రాజకీయ సలహాదారు దుట్టా రామచంద్రరావు తెర మీదకు వచ్చారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే తాను ఊరుకోనని పార్టీకి రాజీనామా చేసి.. ఆమరణదీక్ష చేస్తానంటూ ప్రకటనలు చేశారు. కృష్ణా నది పేరు ఉన్న ఒకే ఒక్క జిల్లా …కృష్ణా జిల్లా అని పేరు మార్చితే సహించబోనని వార్నింగ్ ఇచ్చారు.దుట్టా రామచంద్రరావు స్పందనతో… ఒక్కసారిగా రాజకీయ కలకలం ప్రారంభమయింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ పేరును.. వివాదం చేసి.. సంటిమెంట్ గా మార్చి కృష్ణా జిల్లాలో లేనిపోని ఉద్రిక్తతలు సృష్టించి… ప్రజలను సామాజికవర్గాల వారీగా విడదీసి ఓట్ల పరంగా లాభం పొందే ఆలోచనతో ఈ వ్యవహారం నడిపిస్తోందన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. అసలు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే డిమాండ్ ఎక్కడా వినిపించలేదు. అసలు …ఎన్టీఆర్ అంటే విశ్వవిఖ్యాతి పొందిన వ్యక్తి..ఆయన పేరుతో ఓ జిల్లా ఉండాలని డిమాండ్ చేయడం.. ఆయన స్థాయిని తగ్గించడమేననేది చాలా మంది వాదన. అయినా వైసీపీ అధినేత ఈ విషయాన్ని పనిగట్టుకుని కెలికి… దానికి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలతోనే వివాదాస్పద ప్రకటనలు ఇప్పించడం ప్రారంభించారు. దుట్టా రామచంద్రరావు రాజకీయ సలహాదారు కాబట్టి.. ఆయననే ఈ వివాదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగించుకోవాలని వైసీపీ డిసైడయినట్లు తెలుస్తోంది.
ఎవరూ అడగకపోయినా తామే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించడం..దాన్ని సొంత పార్టీ నేతలే ఖండించేలా డ్రామా స్టార్ట్ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుగపురుషుడిని వివాదం చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. ఎన్టీఆర్ పేరును… కావాలని వివాదాస్పదం చేయడం.. రాజకీయం కోసం ఇలా చేయడం సమంజసం కాదంటున్నారు.నిజానికి టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు… వైఎస్ఆర్ కడప జిల్లా పేరులో ఉన్న వైఎస్ఆర్ పేరును తీసేయాలని కడప జిల్లా టీడీపీ నేతలు పట్టుబట్టారు. కానీ చంద్రబాబు.. ఈ విషయాన్ని వివాద్సపదం చేయడం ఎందుకని సైలెంట్ గా ఉండిపోయారు. కానీ వైసీపీ నేతలు ఎన్టీఆర్ పేరును మాత్రం కావాలనే రచ్చ చేసి. .రాజకీయ ఓట్ల వేట సాగించాలని డిసైడయ్యారు.