మహానటి ఆడియో ఫంక్షన్ కి అతిథిగా వచ్చాడు రాఘవేంద్రరావు. సాధారణంగా అతిథులుగా వెళ్లే.. అన్నీ పాజిటీవ్ పాయింట్లే మాట్లాడతారు. కానీ.. రాఘవేంద్రరావు ఆడియో ఫంక్షన్ సాక్షిగా.. చిత్రబృందంపై తన అలకని చూపించేశాడు. ‘సావిత్రి బయోపిక్ తీస్తూ.. నన్ను సంప్రదించలేదు. ఈ విషయం బాధించింది’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడు. సావిత్రితో తనకు చాలా అనుబంధం ఉందని. సహాయ దర్శకుడిగా తన కెరీర్ సావిత్రి సినిమాతోనే మొదలైందని గుర్తు చేసుకున్నారు రాఘవేంద్రరావు. తను సెట్‌కి పిలిస్తే సావిత్రి వచ్చేవారని, పనేం లేదు వెళ్లిపోండి అంటే వెళ్లిపోయేవారని అంతటి అనుబంధం తనకు ఉందని… ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లారు. నిజానికి నాగ అశ్విన్ సావిత్రితో అనుబంధం ఉన్న చాలా మందిని కలుసుకోలేదు. అందులో జమున కూడాఉన్నారు. సావిత్రి, జమున సమకాలికులు. జమునని కలిస్తే చాలా విషయాలు తెలిసేవి. కానీ.. నాగ అశ్విన్ ఎందుకో ఆ ప్రయత్నం చేయలేదు. ఈ విషయంపై జమున కూడా తన అలకని, చిరు కోపాన్నీ చూపించేశారు. ఇప్పుడు దర్శకేంద్రుడి వంతు వచ్చింది. ఇంకా ఈ లిస్టులో ఎంత మంది ఉన్నారో?