సావిత్రి మహానటి అయితే… నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావులు మహనటులు. వాళ్లకు సరితూగే నటులను ఎంపిక చేయడం అంత సులభం కాదు. వాళ్ల పాత్రల్లో నటించి మెప్పించడమూ అంత సులభం కాదు. ఇది తెలిసి చాలామంది వెనుకడుగు వేశారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రల్లో వారసులు తప్ప మరెవరు చేసినా ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితి లేదు. అందుకనే, ఎన్టీఆర్ పాత్రలో నటించమని నేచురల్ స్టార్ నానీని ‘మహానటి’ దర్శకుడు నాగ అశ్విన్ అడగ్గానే ‘నో’ చెప్పేశాడు. అంతకు ముందు ఎన్టీఆర్ మనవడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లారు. ‘మహానటి’ నిర్మాతలలో ఒకరైన అశ్వినీదత్ కుమార్తె స్వప్న, ఎన్టీఆర్ ఎప్పట్నుంచో స్నేహితులు. అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ‘నో’ చెప్పేశాడు. తాతగారి పాత్రలో నటించే దమ్ము, ధైర్యం లేవని ‘మహానటి’ ఆడియోలో కూడా చెప్పారు. దాంతో ఎన్టీఆర్
పాత్రను గ్రాఫిక్స్ ద్వారా సృష్టించారని సమాచారం. అక్కినేని నాగేశ్వరరావు పాత్రకు మాత్రం ‘మహానటి’ దర్శక నిర్మాతలు అంతగా కష్టపడలేదు.
అక్కినేని మనవడు, యువ సామ్రాట్ నాగచైతన్యను మీ తాతయ్యగారి పాత్రలో నటించాలని అడగ్గానే ఒప్పేసుకున్నాడని దర్శకుడు తెలిపారు. ప్రేక్షకులకు చైతూ పాత్ర సర్ ప్రజ్ కింద ఉంటుందని తెలిపారు.