కర్ణాటకలో పోలింగ్ తేదీ దగ్గరపడేకొద్దీ…రాజకీయ చిత్రంలో క్లారిటీ వస్తోంది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి.. కాంగ్రెస్ తరపున సిద్ధరామయ్య..సింగిల్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తున్నారు. బీజేపీ తరపున బౌలర్లు ఎవరొచ్చినా.. వదిలి పెట్టడం లేదు. పంచులతో కర్ణాటక బౌండరీల వరకూ తరిమికొట్టి.. సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతున్నారు. కారణమేమిటో కానీ.. ప్రధాని నరేంద్రమోదీ..కర్ణాటక ఎన్నికల ప్రచారానికి పెద్దగా గడువు కేటాయించలేదు. మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలున్నాయంటే.. ఏడాది ముందే కార్యాచరణ చేపట్టే మోదీ.. కర్ణాటకలో మాత్రం పది రోజుల ముందు మాత్రమే అడుగుపెట్టారు. అప్పటికే..సిద్దరామయ్య సెంచరీ కొట్టేశారు. అమిత్ షా దగ్గర్నుంచి.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వరకు అందర్నీ ఓ ఆటాడేసుకున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప అయితే పూర్తిగా తేలిపోయారు.
సిద్ధరామయ్య దూకుడుతో… పరిస్థితిని మోదీ వర్సెస్ రాహుల్ అన్నట్లుగా మార్చాలని బీజేపీ వ్యూహకర్తలు ప్లాన్ వేశారు. మోదీ కర్ణాటకలో అడుగుపెట్టిన మరుక్షణం రాహుల్ నే టార్గెట్ చేసి… విమర్శలు చేశారు. జాతీయతను ప్రశ్నించారు. అయితే రాహుల్ పెద్దగా కౌంటర్లు వేయలేదు. మళ్లీ సిద్ధరామయ్యే క్రీజులోకి వచ్చారు. మోదీ చేసే ప్రతి విమర్శకు సిద్ధూనే కౌంటర్ ఇస్తున్నారు. అది కూడా.. బీజేపీ తిరిగి సమాధానం చెప్పలేని స్థాయిలో ఉంటోంది. ప్రాసలతో కలిపి ప్రసంగాలు చేయడం మోదీకి ఇష్టం. ఆయన అలానే చేస్తారు. అ ప్రాసల్ని… సిద్ధరామయ్య..తనకు అనుకూలంగా మల్చకుంటూ..ట్రెండ్స్ లో నిలుస్తున్నారు. దాంతో పరిస్థితి… బీజేపీకి అడ్డంగా మారిపోయింది. ఇప్పుడు కర్ణాటకలో పరిస్థితి మోదీ వర్సెస్ రాహుల్ అన్నట్లు కాకుండా… నరేంద్రమోదీ వర్సెస్ సిద్ధరామయ్య అన్నట్లు సాగుతోంది.
బీజేపీ వ్యూహం తిరగబడింది..మోదీకి సరైన కౌంటర్లు ఇస్తూ.. సిద్ధరామయ్య ఇమేజ్ పెంచుకుంటూంటే… సమాధానాలు చెప్పలేక బిక్కచచ్చిపోయి బీజేపీ.. మోదీ ఇమేజ్ను తగ్గించుకుంటోంది. మోదీ.. తొలి రోజుతో పోలిస్తే.. కాంగ్రెస్‌పై విమర్శలు తగ్గించేశారు. సామాజివర్గాల్ని కాంగ్రెస్‌పైకి ఉసిగొల్పడానికే ప్రయత్నిస్తున్నారు. దీంతో మోదీ ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయారన్న ప్రచారం జరుగుతోంది. దేశం మొత్తం ఓ సారి సునామీ సృష్టించిన మోదీ.. ఇప్పుడు కర్ణాటకలో.. సిద్ధరామయ్య అనే తుఫాన్ ముందు తేలిపోతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ సాధించే ఫలితాలు.. ఆ పార్టీ భవిష్యత్‌పై ప్రభావం చూపిస్తుంది. అలాగే నరేంద్రమోదీపై కూడా. కర్ణాటకలో అందరూ అనుకుంటున్నట్లు మూడో స్థానానికి కానీ బీజేపీ దిగజారితే… మోదీ రేంజ్… గాలి పోయిన బెలూనే. అందులో నో డౌట్.