మీడియా చానళ్లు కవర్ చేయడం మాని వేసినప్పటికీ శ్రీరెడ్డి మాత్రం సోషల్ మీడియాలో పదునైన వ్యాఖ్యలు చేయడం మాన లేదు. లేటెస్ట్గా ఫైర్ బ్రాండ్ రోజా పై విరుచుకు పడింది శ్రీరెడ్డి. ఇటీవల రోజా మాట్లాడుతూ నటుడు రాజశేఖర్ పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం అంటూ సామాజిక కార్యకర్త సంధ్య పై విరుచుకు పడిన విషయం తెలిసిందే. ఉద్దేశపూర్వకంగానే రాజశేఖర్ పై ఆరోపణలు చేశారని, రాజశేఖర్ అలాంటివాడు కాదు అని రోజా కితాబిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు శ్రీరెడ్డి దీనికి కౌంటర్ ఇచ్చింది.
“రోజా గారు, బాగానే కవరు చేశారు మీరు . ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది లేదా వామ్మో . మీరు ఇండస్ట్రీకి వచ్చి 27 సంవత్సరాలు అయింది కదా, మరి మిమ్మల్ని ఎవరు కెలక లేదా ? కొంపతీసి మీరు ఎవరికి నచ్చలేదేమో? నేను ఇండస్ట్రీ మీద బురద వేశానా తల్లి? ఇండస్ట్రీ మొత్తం రిపోర్ట్ రెడీ అవుతోంది. నాతో పెట్టుకో వద్దమ్మా”. ఇవీ శ్రీరెడ్డి వ్యాఖ్యలు.
అయితే ఏది ఏమైనా శ్రీరెడ్డి, ఏదో రకంగా పోగొట్టుకున్న పాపులారిటీ మళ్ళీ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే శ్రీరెడ్డి వ్యాఖ్యలకు అటు మీడియా మాత్రమే కాకుండా ఇటు ప్రజల నుంచి కూడా పెద్దగా స్పందన రావడం లేదు.