చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ‘ఠాగూర్’ ఒకటి. అందులోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ని రామౌజీ ఫిలిం సిటీలోని మండువా హౌస్ సెట్లో షూట్ చేశారు. అంతకు ముందు అందులో చాలా షూటింగులు చేశారు. అయితే ‘ఠాగూర్’ తరవాత నుంచి ఆ ఇంటిని ‘ఠాగూర్’ హౌస్ అని పిలవడం స్టార్ట్ చేశార్ట. ఇప్పుడు ఆ ఇంటిలోనే సుమంత్ హీరోగా నటిస్తున్న 25వ సినిమా ‘సుబ్రహ్మణ్యపురం’ షూటింగ్ జరుగుతోంది. ‘ఠాగూర్’ హౌస్‌ని ఈ సినిమాలో హీరో హౌస్‌గా చూపించబోతున్నారు. ఇందులో హీరో పేరు కార్తీక్. రెగ్యులర్ షూటింగ్ మొదలై మూడు రోజులు అవుతోంది. మరో ఐదు రోజులు అక్కడే షూటింగ్ చేయనున్నారు. ఇందులో సుమంత్ సరసన కథానాయికగా తెలుగమ్మాయి ఈషా రెబ్బా నటిస్తోంది. టారస్ సినీ కార్ప్ పతాకంపై సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మళ్లీ రావా’తో హిట్ తరవాత సుమంత్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఏర్పడుతున్నాయి.