యాక్టింగ్, యాటిట్యూడ్‌లతో పాటు విజయ్ దేవరకొండకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ తెలంగాణ స్లాంగ్. మిగతా యంగ్ హీరోల మధ్య అతణ్ణి స్పెషల్‌గా చేసిందీ తెలంగాణ స్లాంగ్. హీరోగా పరిచయమైన ‘పెళ్లి చూపుల’తో పాటు అంతకు ముందు ఇంపార్టెంట్ రోల్ చేసిన ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాల్లో యూత్ స్టార్ తెలంగాణ యాసలో మాట్లాడాడు. ఒకవేళ అతను పక్కా గోదావరి కుర్రాడిలా ఆంధ్రా యాస మాట్లాడితే ఎలా వుంటుంది? దర్శకుడు భరత్ కమ్మకు ఇదే ఆలోచన వచ్చింది. విజయ్ దేవరకొండనూ ఈ ఆలోచన ఎగ్జయిట్ చేసింది. భరత్ కమ్మ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’లో కాకినాడ యాసలో మాట్లాడాలనుకున్నాడు. యూనిట్ మధ్య ఈ టాపిక్ డిసిషన్‌కి వచ్చిందో? లేదో? న్యూస్ బయటకు వచ్చింది. ఆడియన్స్ కూడా కాకినాడ యాసలో విజయ్ దేవరకొండ డైలాగులు ఎలా వుంటాయోనని ఎగ్జయిట్ అయ్యారు. షూటింగులో ఏమైందో ఏమో… కాకినాడ యాస బదులు విజయవాడ యాసలో హీరో క్యారెక్టర్ మాట్లాడేలా మార్పులు చేశారు. దీనికి కారణం ఒక్కటే… విజయ్ కాకినాడ యాసతో ఇబ్బంది పడటమే అని టాక్. కాకినాడ అంటే మరీ గోదావరి యాస ఎక్కువ వుంటుంది. అదే విజయవాడ అయితే కొంచెం సేఫ్‌గా వుంటుందని చేంజెస్ చేశార్ట. రీసెంట్ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ కూడా ‘డియర్ కామ్రేడ్’లో కాకినాడ యాసలో కాకుండా విజయవాడ యాసలో మాట్లాడతానని చెప్పారు. అది ఎలా వస్తుందో? ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో? చూడాలని వుందని చెప్పుకొచ్చారు.